[డా. బి. హేమావతి రచించిన ‘ప్రియాత్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నన్ను చూడని నీ కళ్ళని
నా అరచేతులతో మూయాలని
నాతో మాట్లాడని నీ నోటిని
నా పెదవులతో మూయాలని
నాలో ఏదో తీరని కోరిక
కన్నులలో నిన్ను చూసినపుడు
నా ప్రతిబింబాన్ని నే చూసాను
మాట్లాడని నీ పెదవులలో
మమతనే నే చూసాను
ఒడిలోని పాపతో ఎన్నెన్నో ఊసులు
నిన్నే చూసాను నా పాప గా

డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.