[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము.]


భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- భారతాన్ని అనుసరించి పాలసముద్రం నుండి పుట్టినది, కద్రువ, వినతల కలహానికి కారణమైనది అయిన ఇంద్రుని గుఱ్ఱం పేరేమిటి?
- భారతం ప్రకారం తీర్థయాత్రలు చేస్తున్న అర్జునుడికి సుభద్ర గురించి చెప్పినదెవరు?
- పద్మ పురాణం ప్రకారంగా, శివుని కేశాల నుండి మూడు ముఖాలతో, మూడు తోకలతో, మూడు కాళ్లతో, ఏడు చేతులతో ఆవిర్భవించిన ప్రమధుని పేరు?
- భారతాన్ని అనుసరించి 12 ఏళ్ల లోపు పిల్లలు చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని శాసించిన ముని ఎవరు?
- భారతాన్ననుసరించి, త్రివక్ర, శ్రీకృష్ణుల కుమారుడు, యాదవ రాజకుమారుడు, నారదుని శిష్యుడు, సాత్వత తంత్రము అనేది రచించిన వారెవ్వరు?
- భాగవతం ప్రకారం శివుని జట నుండి పుట్టినవాడు, గణాధిపతి, ఆకాశంలో గ్రహం అయ్యేట్లు శివుని వరం పొందినవాడు, దక్షుడి యజ్ఞం ధ్వంసం చేసిన వాడెవరు?
- జైమినీ భారతాన్ని అనుసరించి స్త్రీరూపంలోని నారదునికి, తాళధ్వజుడికి పుట్టిన కుమారుని పేరేమిటి?
- ప్రకృతి స్వరూపులైన దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి లను ఏమని పిలిచెదరు?
- శ్రీకృష్ణున్ని జంతువనుకొని బాణం వేసిన బోయవాడు, వేటగాడు, ఆటవీకుడెవరు?
- పాచికలాడి, పాండవులను అడుక్కు తినేలా చేయాలన్న దుర్యోధనుడి కోరిక కోసం ధృతరాష్ట్రుడు ఒక అద్భుత భవనం కట్టిస్తాడు. ఆ భవనం పేరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 ఏప్రిల్ 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-4 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 ఏప్రిల్ 27 తేదీన వెలువడతాయి.
జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 2 జవాబులు:
1) మనోజవం 2) బ్రహ్మ మానస పుత్రులు 3) సత్యయుగము 4) అలాయుధాసురుడు 5) సుందుడు 6) మధుకైటభులు 7) ఉపపాండవులు 8) బ్రహ్మపురి 9) మణిగ్రీవుడు 10) మందారుడు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 2 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- పెయ్యేటి సీతామహాలక్ష్మి, తిరుపతి
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
