[భారతీభూమిక సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ‘పువ్వు పుట్టగానే 2024..’ పోటీ – ప్రకటనని అందిస్తున్నారు అధ్యక్షులు పి. లలితారాణి.]
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నది నానుడి. వివిధ రంగాలలో నిష్ణాతులైనవారు, సుదీర్ఘ ప్రయాణంతో అత్యుత్తమమైన లక్ష్యాలను సాధించేవారు, తమ మొదటి అడుగుల నుండే తమ శక్తినీ స్ఫూర్తినీ ప్రదర్శిస్తారు. ఆ తొలిదశలో కొంతమందికి ప్రోత్సాహం లభించవచ్చు. కొందరికి లభించకపోవచ్చు. ఇతరుల నుండి గుర్తింపు లభించినా లభించకపోయినా తమ శక్తిని, ఆసక్తిని తాము తెలుసుకుని దానికి నిరంతరం మెరుగులు పెట్టుకుంటూ, నిరాశపడకుండా సాగిన వారే తమ రంగాలలో ప్రసిద్ధులవుతారు.
రచయితలూ అంతే. రచయితలు కొంత ప్రసిద్ధులయిన తర్వాత వారికి పేరు తెచ్చిన రచనలని అందరూ చదువుతారు. అది నచ్చితే వారి ఇతర రచనల గురించి కూడా తెలుసుకోవడానికి, చదవడానికి ప్రయత్నిస్తారు. కాని ప్రసిద్ధ రచయితల తొలిరచనను చదవడం, దానిని విశ్లేషించడం, ఆ మొదటి అడుగులలో వారు కనబరచిన ప్రతిభను గమనించడం, ఆ తర్వాత ఆ ప్రతిభను వారు ఎలా పెంచుకున్నారో అర్థం చేసుకోవడం – ఇదంతా ఒక ఆకర్షణీయమైన అధ్యయనం.
ఈ అంశాన్ని నేపథ్యంగా తీసుకుని భారతీభూమిక నిర్వహిస్తున్న కార్యక్రమం ‘పువ్వు పుట్టగానే..’.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం టి. శ్రీవల్లీ రాధిక గారి తొలిపుస్తకం ‘రేవు చూడని నావ’ ను ఎంచుకున్నాం.
~
టి. శ్రీవల్లీ రాధిక కథారచయిత్రిగా ప్రసిద్ధులు. అయితే వారు మొదట ప్రచురించినది కవితాసంపుటి. 1996లో ప్రచురించబడిన ‘రేవు చూడని నావ’ కవితా సంపుటిలో 34 వచన కవితలున్నాయి. ఈ కవితలన్నిటినీ వారు పదహారు నుండి పాతికేళ్ళ మధ్య వయసులో వ్రాశారు.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdeDN35VTyHqXIIKKClbfj3jC0whJzI63gObIemP6Qp5MLlLg/viewform?usp=pp_url
పేరు, చిరునామా తదితర వివరాలు నింపిన తర్వాత 9490000805 number కు ₹ 50/- Gpay ద్వారా పంపి screenshot upload చేయవలసి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకున్నవారికి ‘రేవు చూడని నావ’ పుస్తకం post లో పంపబడుతుంది.
పుస్తకంలోని కవితలను వస్తువు, శైలి, శిల్పం తదితర అంశాల ఆధారంగా విశ్లేషిస్తూ 1000 పదాలకు మించకుండా రాసిన మీ వ్యాసాలను యూనికోడ్లో పంపవలసి ఉంటుంది. వ్యాసంపై మీ పేరుతో పాటు రిజిస్ట్రేషన్ నంబరును కూడా పేర్కొనగలరు.
ఆ సంపుటిలోని కవితలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలలో ఉత్తమమైన మూడు వ్యాసాలకు (ఒక్కొక్క విభాగంలో) బహుమతులు ఉంటాయి. బహుమతి పొందకపోయినా బాగున్న వ్యాసాలన్నిటినీ ‘భారతీభూమిక’ ఒక పుస్తకంగా ప్రచురిస్తుంది.
తెలుగు సాహిత్యాభిమానులు అధికసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అకాంక్షిస్తున్నాము.
పి. లలితారాణి
అధ్యక్షులు
భారతీభూమిక సాహితీ సాంస్కృతిక సంస్థ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంచిక – పదప్రహేళిక సెప్టెంబరు 2021
మనదైన వ్యక్తిత్వ వికాస గ్రంథం ‘నేర్పుగా జీవించడం ఎలా!’
పదసంచిక-96
కశ్మీర రాజతరంగిణి-25
సాహిత్యైకజీవి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు
అమెరికా సహోద్యోగుల కథలు-14: తెలుగు తేజోమూర్తులు
అమ్మ చెప్పిన కథలు
నూతన పదసంచిక-42
మనోమాయా జగత్తు-9
జూన్ 2019 సంపాదకీయం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®