1.
ఆవేశం
అన్ని విధాలా నష్టం
అదుపులో పెట్టటమే
లక్ష్యం కావాలి
2.
రోజులు
కలసి రావటంలేదు
ఐతే
శని మహర్దశ ప్రారంభం
3.
తొలి సంధ్య
మలి సంధ్య
మధ్యలో జరిగే
జగన్నాటకాలేనెన్నో
4.
కళ్ళ వెంట
కన్నీరు వరదలైయ్యే
మనసు ఎంతగా
గాయపడిందో మరి
5.
మరణమనేది
ప్రతి జీవికి తథ్యం
ఎప్పుడనేది
కాలునికే ఎరుక
6.
ఆత్మ
మానవజాతికే పరిమితమా?
ఇతర జీవరాశుల
సంగతి?
7.
అధికారమిస్తే
అందలమెక్కిస్తా
ఆ, ఆశ
నేనే అందలమెక్కుతా
8.
జగన్నాటక
సూత్రధారి ఎవరో?
కనిపెట్టుట
మానవ సాధ్యమేనా?
9.
అనేక రకాల
జీవరాసులు
పుట్టుట గిట్టుటలోని
రహస్యమేమిటో ?

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.