సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    మీ “సాఫల్యం” (14) నవల ఆసక్తికరంగా సాగుతుంది. పతంజలిని ఉత్తమాభిరుచిగల నాయకుడిగా వ్యక్తీకరించడంలో రచయితగా మీరు సఫలీకృతులయ్యారు.
    కొడుకుగా బాధ్యతల నుంచి తప్పుకోనని తండ్రికి అభయమిచ్చిన తీరు, పైచదువులపై గల ఇష్టం, అతని పఠనాసక్తి, స్వయం ఉపాధిపై గల విశ్వాసం యువతకి ఆదర్శప్రాయంగా ఉండడమే కాదు, అతన్ని నవలా నాయకుడిగా నిలబెట్టాయి.
    ప్రఖ్యాత కొమ్మూరి ద్వయం గురించి, వారి రచనల విశ్లేషణ చాలా బాగుంది.
    అదే రకమైన కథా సన్నివేశాలుగల ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యాన్ని తలకెక్కించుకొని తెలుగులో మాత్రం దానిని కాస్త చౌకబారుగా ముద్ర వేయడం బాగోలేదని అనడం హర్షణీయం.
    తెలుగు నవలలను స్త్రీ(వాద) రచయితల ప్రభావం నుండి కొంతవరకు తప్పించిన మల్లాది వారి ప్రస్తావన సందర్భోచితంగా ఉంది. మీ నవల తదుపరి భాగంకై ఎదురు చూస్తున్నాము. 👏👏💐💐🙏
    Dr. ప్రభాకర్, regional joint director of higher edn(retd), Hyderabad.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం పతంజలి చదువుకై సాగిన ప్రయాణం బాగుంది. చదువుకై అతని తపన, తండ్రికి భారం కాకుండా ,ట్యూషన్లు చెప్పటం ,మంచి పుస్తకాల పరిచయం చాలా బాగుంది.
    ముఖ్యంగా, తనను తాను చక్కగా మలచుకోవటం అదీ మంచి పుస్తకాలవల్లేనని గ్రహించటం మంచి వ్యక్తిత్వానికి గీటురాళ్ళు.
    మధు పాత్రుని శైలజ, హైదరాబాద్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Very interesting
    పద్మా రామచంద్ర

  4. 5

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీ దత్త శర్మ గారు తన సాఫల్యం నవలలో పతంజలి పాత్రను ఉదాత్తముగాచిత్రీకరిస్తారు.ఇందుతండ్రికి వ్యవసాయ రంగం లో సహాయ పడుచూ తనవిద్యాభ్యా సమునుకొన సాగిస్తున్న వైనంచాలాగొప్పది.అదీగాక పొరుగున ఉన్న పిల్లల కు ట్యూషన్ చెప్పుచూ వ్యవసాయములో వచ్చిన నష్టమునకు ,ఈవిధంగా నష్టనివారణచర్యకుపక్రమించండంపతంజలి,గుండె నిబ్బరానికిమచ్చుతునక.పిల్లల కుపెద్దవారిని ఎలాగౌరవించాలో వారికి బోధ పరచి,వారి వ్యక్తిత్వవికాసానికి పునాదులు వేస్తాడు. పతంజలి యొక్క మంచి వ్యక్తి త్వం గమనించిన రాధాసారు లాంటి పెద్దలు పతంజలి కిచదువుకొనే విషయంలో ఆర్ధిక సహాయంచేయుటకు ముందుకు వస్తారు.ప్రయివేట్ గా పరీక్షలు వ్రాయుటకు హైదరాబాదు బయలుదేరి మార్గమధ్యంలోశ్రీ కొమ్మూరివారి ‘వ్యక్తిత్వంలేని మనిషి”నవల చదువు తాడుఈన‌వల లో మానసిక విశ్లేషణ కనిపిస్తుంది.ఒకవ్యక్తితనకంటూస్వంత అభిప్రాయాలు,వాటినిధైర్యంగావ్యక్తం చేయలేని అశక్తత,అంతులేని మొహమాటం,ఒకమనిషిజీవితాన్ని ఎంత గా ప్రభావితం చేస్తాయో వర్ణించారు. “స్వభావో దురతి క్రమః” అనిపతంజలి అభిప్రాయం. కానిశ్రీకొమ్మూరి వారి అభిప్రాయం, దీనికి వ్యతిరేకం.చదువు, చుట్టుప్రక్కలపరిస్థితులు స్నేహితులు, వీరందరి ప్రభావం తో మన స్వభావంలోనిలోపాలనధిగమించవచ్చని శ్రీ కొమ్మూరివారిఅభిప్రాయం. అల్లాగే “వస్ర్తేణ వపుషా వాచా”మనంధరించినవస్ర్తధారణ,శరీర సౌష్టవం, మనమాట తీరుపై ఇతరుల కుమనమీద ఒకఅభిప్రాయంకల్గిస్తాయి.ఈవిధంగా విశ్లేషణ చేయగా కవియొక్క ఉదాత్తభా వాలు,సంఘ శ్రేయస్సు, వ్యక్తి త్వవికాసానికితోడ్ప, డేవిధంగ రచనచేస్తూ, సమాజానికి సేవచేద్దామనేఆకాంక్ష వ్యక్తమౌతుంది.ఇలాంటి రచనలు నేటి సమాజానికి మిక్కిలి అవసరం.👌🏻👌🏻💐
    ఆచంట సూర్య నారాయణ మూర్తి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, భాషా ప్రవీణ,ధర్మా చార్య, టీటీడీ.

  5. 6

    కొల్లూరి సోమ శంకర్

    మిత్రమా నమస్కారం!
    మీ సీరియల్ కోసం చకోరపక్షి లా ఎదురుచూస్తున్నాను.
    చాలా బాగుంది.
    డిటెక్టివ్ నవల కాదు,కాని అలాంటి ఉత్సుకత కలుగుతోంది.తర్వాత ఏమవుతుందో అని.👏🌹
    గౌరవరాజు సతీష్ కుమార్, కవి, విమర్శకులు, వనస్థలిపురం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!