అవినీతి మడుగులోకి జారిపోయి
బురదలో కూరుకుపోయిన
మానవ విలువల పుస్తకం
పుటలన్నిటినీ పరపరా చింపేసుకుంటోంది….
జీవితపు ఆటలో
ఓడిపోయానన్న కడుపుమంటతో
తనను తానే కాల్చేసుకొంటోంది
ఎదగాలన్న కోరికతో
ఆశల మెట్ల అడ్డ దారిలో
పక్కవాని పైకెక్కేసి
ఎదుటివాణ్ణి వెెనక్కితోసేసి
ముందుకు దూసుకెళుతోన్న నవనాగరీకం…
తన చేయి వదిలేసి వెళుతోంటే
బతుకుబంధాన్ని తెంచేసి
నిర్దాక్షిణ్యంగా తుంచేసి
తనదారి తాను చూసుకుంటుంటే….
దిక్కుతోచని మానవత్వం
వెక్కివెక్కి ఏడుస్తోంది ఒంటరిగా కూర్చుని
నీతికథల్లో కనిపించిన
జంటకవుల్లాంటి జాలీ దయ…
అదేమిటో…?
బిక్కుబిక్కుమంటూ
నాలుగు దిక్కులూ చూసుకుంటూ
గోడల చాటున దాక్కుంటూ
ఏ కంటా కనబడకుండా
రహస్యంగా తిరుగుతున్నాయి…
స్వార్థాన్ని సారాలా తాగేసి
నిషాలో నింపాదిగా చిందులేస్తున్న
ఈ నయా నరావతారం
ఎక్కడ తమ ఇద్దరినీ
చీకుల్లాగా నంజుకు తింటుందేమోనని
భయమేసి
చేతుల్లో చేయేసి
కాకి ఎంగిలుల స్నేహం చేసి,
అంటకాగి
చిన్నతనాన్నంతా వెంట తిరిగిన
నీతి ఇంటిపేరైన నిజాయితీ…
అంతంత దూరంనుంచే
ముఖం తిప్పుకుని,
పక్కకు తప్పుకుని వెళ్ళిపోతోంది ఈమధ్య…
అవసరాలవారి అవినీతిని
వెంటబడి ప్రేమించి పెళ్ళిచేసుకున్న
మనిషి చాకచక్యానికి
అపర చాణక్యానికి హడలిపోయి
దిగాలుపడిన హృదయాలతో అవన్నీ
నివ్వెరపోయి వింటున్నాయతని మాటల్ని
“కుఛ్ పానా హైతో… కుఛ్ ఖోనా హై”
సమ్ఝే ….!
అంటూ వెర్రిగా … గట్టిగా అరుస్తుంటే.

చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
13 Comments
Krishna
బాగుంది
Sridhar
Thank you Krishna for comment
Kv
బాగుంది…
Sadanand
మాటల మాంత్రికుడు…సదానంద్… మంచేరియల్
Ganesh bandari
Excellent sir
శ్రీధర్ చౌడారపు
Thank you Ganesh
Sharada
Very nice. Excellent meaning and a good expression of human psychology
David
Awesome poetry sir…..might be blown out of pain and agony regarding worsening of the society…..hope some or other might be inspired as I do…… thank you sir
Sridhar Choudarapu
ధన్యవాదాలు డేవిడ్
వారాల ఆనంద్
బాగుంది సర్, అభినందనలు
శ్రీధర్ చౌడారపు
ధన్యవాదాలు ఆనంద్ గారూ
A. సుధాకర్
శ్రీధర్ గారి కవిత చాలా బాగుంది…. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న అవినీతిపై మనస్సును హత్తుకొనేట్లు వ్రాసారు…. అభినందనలు….
Sridhar Choudarapu
ధన్యవాదాలు సుధాకర్ గారు