05-Sep-2021: ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సమాఖ్య, సాహిత్య సంగీత సమాఖ్య హైదారాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘డా. ఊటుకూరి తెలుగు సినిమా/ పాటల డిజిటల్ పుస్తక డిమాన్స్ట్రేషన్’ Zoom ద్వారా నిర్వహించడమైనది. డా. కె. ఐ. వరప్రసాద్ రెడ్డి గారు (పద్మభూషణ్ గ్రహీత) ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. ప్రత్యేక అతిథి ప్రసంగాలను అందించినవారు శ్రీయుతులు రేలంగి నరసింహారావు (ప్రముఖ దర్శకులు), భువనచంద్ర (గేయ రచయిత), పైడిపాటి రాజేంద్రకుమార్ (మాటల రచయిత), సురేష్ మాధవపెద్ది (సంగీత దర్శకులు), వాసు రావు (సంగీత దర్శకులు), వంశీ రామరాజు (వంశీ ఫౌండేషన్) గార్లు, మరియు సినీ విశ్లేషకులు శ్రీయుతులు వి. వి. రామారావు, ఆచారం షణ్ముఖాచారి గార్లు. కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించినవారు శ్రీమతి శారద ఆకునూరి (అమెరికా) మరియు సారధి మోటమఱ్ఱి (ఆస్ట్రేలియా).
కార్యక్రమ ముఖ్య ఉద్దేశం డా. ఊటుకూరి గారు దశాబ్దాల కృషితో సంకలనం చేసిన 1932-2000 మధ్య విడుదలైన తెలుగు సినిమాలు, పాటల సమగ్ర సమాచారం/ గణాంక విశ్లేషణ. 1932-2000 వరకు అసలు ఎన్ని సినిమాలు తెలుగు లో వచ్చాయి (నేరుగా + డబ్బింగ్)? ఆ సినిమాల సాంకేతిక వివరాలు ఏమిటి? అంటే ఏ బ్యానర్ పై ఎవరు నిర్మించారు, దర్శకత్వం, సంగీతం, కథ, మాటలు, పాటలు, గాయకులు, నటవర్గం, విడుదల రోజు లాంటి వివరాలు ఇందు పొందు పరచబడ్డాయి. అంటే 5,203 సినిమాల, 3,058 నిర్మాతల, 1,234 దర్శకుల, 1,364 కధారచయితల, 512 మాటల రచయితల, 4,133 నటీనటుల వివరాలు Telugu Filmography Vol 1&2 లలో నిక్షిప్తం చేశారు. 1932-2000 వరకు అసలు ఎన్ని పాటలు సినిమాల లో వచ్చాయి ఆ పాటల సాంకేతిక వివరాలు ఏమిటి? అంటే ఏ చిత్రంలో ఎన్ని పాటలు, ఎవరు రాశారు, సంగీత దర్శకత్వం ఎవరు, పాడినది ఎవరు వివరాలు ఇందు పొందు పరచబడ్డాయి. 31,257 పాటల, 587 గేయరచయితల, 427 సంగీత దర్శకుల, 1,165 గాయకుల వివరాలు A Repository for Telugu Film Songs Vols 1,2&3 లలో నిక్షిప్తం చేశారు. ఈ సమగ్ర సమాచారం interactive book గా వెలువరించే ప్రయత్నంలో తొలి సంకలనం శ్రోతలకు చూపడం జరిగినది. అతిధులు ఇటువంటి సమగ్ర సమాచారం ఇంతకుముందు రాలేదని,ఇది తెలుగు సినీ పరిశ్రమకు, పరిశోధకులకు, విశ్లేషకులకు, అభిమానులకు ఎంతో ఉపయుక్తమని, డా. ఊటుకూరి, ఆస్ట్రేలియాలో ఉంటూ, పరిశ్రమపై మక్కువతో చేసిన ఈ కృషి బహుధా ప్రసంశనీయమని, ఆయనను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగురీతి (నంది లాంటి) అవార్డులతో సత్కరిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమ వీడియోను ఈ లింకు ద్వారా చూడవచ్చు: https://youtu.be/cnjenqvUjgU.
మరిన్ని వివరాలకు: సారధి మోటమఱ్ఱి, http://www.facebook.com/TeluguSahitiSamaakhya, msradhi@yahoo.com.
13-నవంబరు-2021: ఆస్ట్రేలియాలో తెలుగు వసంతం, ఆస్ట్రేలియావాసులైన భాషాభిమానమున్న శ్రోతలను, వక్తలను ఒకే వేదికమీదకు తెచ్చిన తొలి ప్రయత్నం, మన భాషలో మనం కాసేపు సరదాగా మాట్లాడుకుందాము అనే భావన. నవంబరు 13వ తేదీన అంతర్జాలం జూమ్ లో మధ్యహ్నం 2 గంటలనుంచి, నాలుగున్నర గంటలపాటు నిర్విరామంగా కొనసాగిన కార్యక్రమంలో సుమారు 40 వక్తలు, ఆస్ట్రేలియాలోని వివిధ నగరాలనుంచి (Sydney, Melbourne, Canberra, Brisbane, Adelaide, Perth, Gold Coast, Darwin, Townsville) పాల్గొన్నారు. ప్రసంగ విభాగాలు: పద్యాలు, కవితలు, కథలు, కథానికలు, ప్రసంగాలు, పాటలు, ఆస్ట్రేలియా అనుభవాలు. వక్తలకు సూచనలు-నిబంధనలు: తెలుగుభాషలో ఉండాలి, స్వీయరచనలై ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, మాట్లాడే నిడవి 3 నుండి 5 నిమిషాలు, యువత తెలుగులోకాని ఇంగ్లీష్ లోకాని మాట్లడవచ్చు. ఈ కార్యక్రమ వీడియోను ఈ లింకు ద్వారా చూడవచ్చు https://www.facebook.com/saradhi.motamarri/videos/627345391724341/?__tn__=%2CO-R.
ఏకీకృత భావనతో వీక్షించ గలిగితే – ప్రకృతి అంతా, భిన్న విజ్ఞానాల సమాహారమేనని; కళల మరియు శాస్త్రీయ శాలలు, వేరు వేరు కాదని; వాటి అభేద భావనయే – జ్ఞానానికి పరాకాష్టయని – మోటమర్రి సారధి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఒక కవిత వ్రాయంలో, ఒక వంతెన నిర్మించడంలో లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సృజించడంలో – భేదాలు తనకెప్పుడూ అగపడలేదంటారు. మనుషులు, మనుషుల తత్వాలు; కొండలు, కోనలు; నదులు, సముద్రాలు; వినీలాకాశం, నిర్మలత్వం – ఇవన్నీ ఆయనకు ప్రేరణ కలిగించేవే. మానవజాతిని ఉన్నత స్థితికి కొనిపోవాలని, అత్యున్నత సాహితీ సంపదను, మనకందించిన, ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలందరికీ, మనమెంతో ఋణపడి ఉన్నామని అభిప్రాయపడతారు.
మానవజాతి చరితను క్లుప్తంగా క్రోడీకరించిన, స్వామి వివేకానంద, ఈ నాలుగు మాటలు, తననెంతో ప్రభావితం చేశాయని చెబుతారు: “మనిషి అడుగు వేసినప్పుడు, ముందుకు పోయేది – మెదటి కంటే, అతని ఉదరమే (ఆకలి)! ఉదరాన్ని (ఆకలిని) దాటి, మానవజాతి ముందుకు అడుగు వెయ్యడానికి, యుగాలు పట్టవచ్చు.”
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నేనే విజేత
ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -11
అందరూ దొంగలే
దురదలలో పలు రకాలు!
పర్యావరణం కథలు-8: అంతరిక్షంలో కాలుష్యం
కార్తీకం రాగానే….
ప్రేమించే మనసా… ద్వేషించకే!-5
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-5
జీవన రమణీయం-1
‘నాకు నచ్చిన నా కథ’ – కథా సంకలనం – ప్రకటన
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®