[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1 గారాలు మారాలు అదుపు తప్పితే అయ్యేను మోయలేని భారాలు
రాధా రాణి. వేమూరి హైదరాబాద్
2 ఒడి బడి రెండూ నేర్పుతాయి జీవితానికి కావలసిన ఒరవడి.
వి.వి.వి. సత్యనారాయణ, రాజమహేంద్రి.
3 ముళ్ళు బీళ్ళు కృషితో అవుతాయి పరిమళాల పూల పొదరిళ్ళు
సింహాద్రి వాణి విజయవాడ
4 హేళనలు! లాలనలు!! మనిషి చేయాల్సింది తనలోని వ్యతిరేకభావాల ప్రక్షాళనలు!!!
మన్నవ నాగ లలిత శ్రీదేవి విజయవాడ.
5 మనస్సు ధనస్సు వయసులో కోర్కెలను నిగ్రహించడం ఒక తపస్సు.
డాక్టర్ .సి. వసుంధర, చెన్నై
6 చదువులు పదవులు, పలుకరాదు పరులను బాధపెట్టే మాటలను- పెదవులు
పంతుల లలిత-నీలాంజన విశాఖపట్నం
7 భావం! ముభావం!! చొరవ పెరగటానికి మార్చుకోవాలి మనిషి స్వభావం!!!
మన్నవ సుధాకర్ విజయవాడ.
8 తడవ గొడవ ఎవరికెంతనే సమస్యల సంద్రంలో దరిచేరదు పడవ
డా: చిట్యాల రవీందర్ హైదరాబాద్
9 పుస్తకాలు మస్తకాలు చదవడం ఆపేస్తే భవితకు ఇవ్వడమే తిలోదకాలు.
సాధన.తేరాల, ఖమ్మం,
10 పోరాటం! ఆరాటం కనుమరుగు కావటం తప్పదు., ఎందుకీ ఉబలాటం
నేమాన సుభాష్ చంద్ర బోస్, విశాఖపట్నం
11 పద్యము గద్యము నిబంధనలను పాటిస్తే అవే మనకు హృద్యము
రావెల పురుషోత్తమరావు అమెరికా
12 ఉచ్ఛ్వాస నిశ్శ్వాస ఉంచాలి ఎల్లప్పుడూ శ్వాస మీద ధ్యాస!
కుసుమ పత్రి తణుకు ,పశ్చిమ గోదావరి జిల్లా.
13 సవ్యము దివ్యము మంచిదారిలో నడిస్తే జీవితం సదా భవ్యము!
బి.గీతాకుమారి సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
14 బేరం సారం కృత్రిమ కొరత సృష్టించి అమ్మడమే ఘోరం!
యన్.కే. నాగేశ్వరరావు, పెనుగొండ
15 హితులు సన్నిహితులు మన తప్పులను తెలియజేస్తేనే నిజమైన స్నేహితులు
కాటేగారు పాండురంగ విఠల్ హైదరాబాదు
16 ధాతువు కేతువు దైవముపై, శాస్త్రముపై విశ్వాసమే భక్తికి హేతువు.
పుష్ప వేఙ్కటశర్మా. భువనేశ్వరము., ఒడిశా.
17 దైవాలు శవాలు పరదేశంలోని బిడ్డల కోసం ఎదురుచూస్తున్న జీవాలు
కట్టెకోల చిన నరసయ్య, ఖమ్మం
18 చిందర వందర చక్కబెట్టాలంటే కొంత సమయం కావాలి ముందర
కోటమహంతి వెంకటరావు(కోవెరా), విశాఖపట్నం
19 డబ్బు ఉబ్బు బతుకనే ఆకాశంలో మురిపించి తేలిపోయే మబ్బు.
భమిడిపాటి వెంకటేశ్వర రావు హైదరాబాద్
20 తొలిపాఠం గుణపాఠం మంచిని అనుసరించడమే సరి అయిన జీవితపాఠం.
భాగ్యశ్రీ ముత్యం కొవ్వూరు.
21 కర్మం మర్మం ఈతిబాధల విముక్తికి చేయండి విరివిగా ధర్మం.
వి యస్ శాస్త్రి ఆకెళ్ల విజయనగరం.
22 ఆస్తులు పాస్తులు ఎన్నున్నా మనశ్శాంతి లేకుంటే తప్పదు పస్తులు
ఆకుల రఘురామయ్య అనంతపురం
23 నగరము తగరము పనోపాటో చేసుకుంటూ బతుకుబండి లాగాలి అందరము.
డి.అనూష. హైదరాబాద్.
24 చెరువు కరువు ఎండినా, నిండినా వార్తలు,-బతుకేమో బరువు!!
లింగాల వీర భద్రాచారి (మ.ర.సం,)మదనపల్లె
25 తరంతరం నిరంతరం ఆచరించాలి సనాతనధర్మం చెప్పకుండా దేనికీ అభ్యంతరం
ఆచార్య వై వి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్
(మళ్ళీ కలుద్దాం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
లోకల్ క్లాసిక్స్ – 56: జన భారత జయం
శివతాండవలక్ష్మి
కాళిదాసు కావ్యాలలో కలికి తురాయి – రఘువంశం
దివినుంచి భువికి దిగిన దేవతలు 9
నడకలూ – నడతలూ
దేశ విభజన విషవృక్షం-56
పూచే పూల లోన-5
చచ్చినా వేయి
నూతన పదసంచిక-39
సినిమా క్విజ్-61
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®