శార్వరి ఉగాదిన మొదలయింది యుద్ధం
అదృశ్య శత్రువు నెదుర్కొంటూ సమరరథమెక్కి
ప్రతి మనిషొక యోధుడై చేస్తున్న పోరాటం
ఏడాదిగా సాగుతూనే ఉంది నిర్విరామంగా
కనబడని రాకాసి కొరోనా నోరు తెరిచి
సమస్త మానవాళి పై విరుచుకుపడింది
ఎందరికో ఉపాధి పోగొట్టి వీధిపాలు చేసింది
మానవజాతి యావత్తూ భీతావహమైంది
వెల్లువెత్తిన అసామాన్య పగ సైన్యం అది
వైద్యసిబ్బంది సహా ఎందరినో పొట్టనపెట్టుకుని
రక్కసిలా బడుగుల జీవితాల్ని ఛిద్రం చేసి
నేడు బహురూపిగా మారిన క్రౌర్యం దానిది
ఈ అప్రకటిత యుద్ధంలో ప్రజలే సైన్యం
పారిశుధ్యం, పరిశుభ్రత,స్వచ్ఛతే బాణాలు
మనుష్య సమూహంపై పగబట్టిన దండుని
మనమంతా యోధులమై తుదముట్టించాలి
ముగ్గులూ,మావిడితోరణాలూ, బంధుమిత్రులూ
పండిత పంచాంగ శ్రవణాలూ, పిండివంటల
వేడుకలన్నీ వచ్చే ఉగాదికి వాయిదా అడిగి
పండగ సంబరాలు పక్కకి పెట్టి నడవాలిపుడు
వైరి వైరస్ తో పోరుకు స్వీయ రక్షణే ఆయుధం
గృహ నిర్బంధం, సమదూరం,మాస్క్ ధారణ
మరవని దీక్షాకంకణ బద్ధులమై కొనసాగుదాం
మానవకోటి ఆరోగ్యసాధనే ప్రపంచ శాంతి నేడు
తెనుగు సంవత్సరాదిన జనావళి, కోవిడ్ మహమ్మారి పై
యుద్దసన్నద్ధమై మొక్కవోని ఉక్కుసంకల్పంతో
ఈ శర్వరీ ప్రవాహం బారినుండి, నూతన ఉగాది
‘ప్లవ’ రక్షణతో సాగిపోవాలి శుభకృతు దిశగా…!

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
9 Comments
పుట్టి. నాగలక్ష్మి
నేటి ప్రపంచ శాంతి” మానవకోటి ఆరోగ్యసాధనే”అని ….’ప్లవ’ మనని రక్షింస్తుందనే ఆశావహ దృక్పథాన్ని…వెలయించిన కవయిత్రి కి అభినందనలు…
Jhansi Lakshmi
గౌరీ గారి ఆడియో కథలు కూడా విన్నాను నాగ లక్ష్మీ మేడం! Awesome
ఉషారాణి పొలుకొండ
Excellent madam….Chala baga chepparu.




Alivelu.p
Exactly Gowrie Laxmi garu chakkaga vivarincharu. Audio kadalu kuda vinee koddi vinlani pistunnaie .
కొల్లూరి సోమ శంకర్
Chakkani kavitha karthavyaanni bodhisthu saagindi… abhinandanalu bangaaru thalli
Kasimbi
కొల్లూరి సోమ శంకర్
సూపర్ మేడమ్ … ప్రశంసించడానికి మాటలు లేవు
Bhaskar
కొల్లూరి సోమ శంకర్
Yuddha bheri
Swarajya lakshmi..Gudur
కొల్లూరి సోమ శంకర్
Chikati nundi veluturu Loki vachamani ashiddam
Syamala..Hyd
కొల్లూరి సోమ శంకర్
Gouri lakshmi gari kavitha bavundi

వి. రుక్మిణీశశి