“బూమి మింద జీవి నీళ్లలా పుట్టె అని అంటారు.
అట్లా తబుడు నీళ్లలోనే వుండకుండా నేలపైకి ఎట్ల వొచ్చె
ఏల వొచ్చె” అంటా సీనగాన్ని అడిగితిని.
“సొరణ నింకారా” అనే వాడు.
“అదెట్లరా” తిరగా అడిగితిని.
“నీళ్ళలా పుట్టిన జీవి ఆడే పారాడతా వున్నెబుడు
నీళ్లపైనింకా ఎండ దూరి దానికి కండబలమిచ్చె. కండ
బలసిన జీవి ఎగరతాడతా, దుమకలాడతా పోయి నేల మీద
పడె. నేల వాసనకి దానిలా సొరణ పుట్టె, ఆ సొరణే దాన్ని
ముంద్రికి నడిపిచ్చి నీళ్ల జీవిని నేలజీవిగా చేసే, కొత్త
రూపము ఎత్తె” అని ఇలావరిగా సెప్పే.
సొరణలా ఇంత కత వుందా అని నేను అబుడు
తెలుసుకొంట్ని.
***
సొరణ = స్పందన
6 Comments
Manasa
Sorana la intha undha…..telusukontini sir
K.muniraju
సొరణ కత చాలా బాగుంది. డాక్టర్ అగరం వసంత్ గారికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ దండాలు.
Madhu
,

Narayana swamy Bk
Nice
Bhagyamma
Super……
Shilpa mallikarjina
Cha ala bagundi sir