సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    దాదాపు అరవయ్యేళ్ళ నుండి కథలు, నవలలు, వ్యాసాలు, ఆరోగ్య పరమైన వ్యాసాలు రాస్తున్న డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు సాహితీ లోకానికి సుపరిచితులు. సాహిత్య రంగంలో లోనే కాకుండా సాంఘిక కార్యకలాపాల్లో, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూనే ఉన్నారు. వ్యక్తిగా స్నేహశీలి. సౌమ్యురాలు. నా చిన్నతనం నుండి విజయలక్ష్మి గారు లబ్ద ప్రతిష్టురాలిగా ఎరిగివున్నా, ఇన్ని సేవా సంస్థల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించారని ఈ ముఖాముఖి ద్వారానే తెలిసింది.
    సంచిక టీం కు అభినందనలు.

  2. 2

    అత్తలూరి విజయలక్ష్మి

    ఆలూరి విజయలక్ష్మి గారు నాకు చిరపరిచితులు. ఒకప్పుడు కొంచెం చిరాకు, పరాకుగా ఉండే డాక్టర్స్ ని చూసి వీళ్ళు నవ్వుతూ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. వీరిని చూసాక వీరికి కోపం అనేది ఎప్పుడూ ఉండదా అనుకుంటాను. వీరి కథలు, నవలలు చదివి ఎంత చక్కటి పాత్రల సృష్టి, ఎంత చక్కటి భావ వ్యక్తీ కరణ అనుకుంటాను! వారు సమాజానికి చేస్తున్న సేవ లో 2 శాతం కూడా నేను చేయడం లేదే అనుకుంటాను. అమ్మా ! మీరొక స్ఫూర్తి, మీరొక చైతన్యం. మీతో పరిచయం సంచికకే అలంకారం.

  3. 3

    G.S.lakshmi

    డాక్టర్, రైటర్ అయిన ఆలూరి విజయలక్ష్మిగారిని చూస్తుంటే నాకొక అద్భుతాన్ని చూసినట్టుంటుంది. అందులోనూ ఇక్కడ సంచికలో ఆమె అరవైయేళ్ళ సాహితీప్రస్థానం చదివాక మరీ అబ్బురమనిపించింది. సభలలో కలిసినప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటే ఒక అక్కతో మాట్లాడినట్లనిపించేది. ఈమధ్య వ్యక్తిగతంగా కలిసినప్పుడు విజయలక్ష్మిగారు నా పట్ల చూపించిన అభిమానం విలువ కట్టలేనిది. “కొండ అద్దమందు కొంచెమై యుండదా!” అన్నట్లనిపిస్తుంది ఆమెని చూస్తుంటే. అమ్మా, భవిష్యత్తులో మీ వృత్తినీ, ప్రవృత్తినీ కూడా ఇంత అందంగానూ ఆవిష్కరించాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలనీ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!