ఎంత చిత్రమో కదా!
అలవోకగా
హిమ శిఖరాలను
అధిరోహింప జేసీ మురిపించిన
కలలు… అంత లోనే…..
అధఃపాతాళంలోకి తోసివేస్తాయి
కనురెప్పల తలుపులకు
గడియ పెట్టగానే…
గత కాలపు జ్ఞాపకాలను
కళ్ళముందు కదలాడిస్తాయి
కళ్లు తెరవగానే కనుమరుగవుతాయి…
మథనపడుతున్న
మనసులోని భావాలు
కలల అలజడులై
భయపెడుతూ ఓసారి…
భవితపై ఆశలు రేపుతూ
రేపటి స్వప్నాలై
ఊరిస్తుంటాయి ఓసారి…
స్వప్న లోకంలో విహరిస్తూ
నిత్య జీవిత సత్యాలను
మరువరాదు…
కలల సాకారమే జీవిత
లక్ష్యమై సాగించాలి జీవితం

4 Comments
Jhansi koppisetty
బావుందండీ మీ స్వప్న వీధిలో కలల సాకారం


డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా..
బాగారాసా రు
మీకు
అభినందనలు
Sagar
చాలా బాగ వ్రాశారు మేడం. అభినందనలు.
Bindu