[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
281 దైవ భక్తి ఇతర జీవరాశిలో ఉండునా? లేవగానే ఆహారం కోసం వేట కేవలం జీవితాన్ని గడుపుతై కావాలని దైవాన్ని పూజించవు కదా?
282 మూఢ నమ్మకాలకు ప్రజలు బలైపోతున్నారు గాఢంగా నమ్ముతారు, ఆచరిస్తారు వాడ వాడలా ఇదే జరుగుతుంది అడ్డు కట్ట వేసే నాథుడేడీ?
283 యెంత ఎదురు చూసినా రాని ఫలితం కొంత సమయంలోనే వచ్చు పంతం పట్టి ప్రయత్నించినా ఫలితముండదు అంతా సవ్యంగా ఉంటే వెంటనే రావచ్చు
284 బండ రాళ్లు ఒక దానిమీద ఒకటి పేర్చినట్లుంటాయి ఒడిదుడుకులు తట్టుకుంటాయి పడేట్లు కనిపించినా పడిపోవు రోడ్ల వెంట చూడవచ్చు
285 తేనె పూసిన కత్తులు ఎందరో జనంలో వాని నిజ స్వరూపం తేనె తొలగితే గాని తెలియదు కాని దాన్ని తొలగించటము అంత తేలిక కాదు
286 మౌన రాగం ఎందరిలోనో ఉంటుంది తనలోని విషయాలు బైట పడకుండుటకు కొన్ని సందర్భాల్లో అవసరమే ఎన్నటికీ బైటకు రావు కొన్ని
287 అంగ రంగ వైభవముగా వివాహము నగ నట్రతో అమ్మలక్కల ఒంపు సొంపులు రంగంలోకి దిగిన చోరులు తగినంత తస్కరించి పారిపోయె
288 వంపు సొంపుల వయ్యారి భామ కొప్పులో పూలతో అలంకరించె ముప్పులో ఉందని తెలియకపోయె పాపము నిప్పులో ఇరుక్కుపోయి విల విలలాడే
289 భారత రామాయణ రచనా పటిమ యెంత గొప్పో నేర్పుతో అప్పటి కాలమాన స్థితులు ఓర్పుగా పొందుపర్చిరి నేరుగా జనం మన్ననలందినవి
290 మానవ జీవితము వింత వింత నాటకాల సమ్మిళితం తనని తాను మర్చిపోయే స్థితి తానే గొప్ప అని విర్రవీగే స్థితి మన్ననలు పొందే స్థితి
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు. చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు. కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నియో రిచ్-11
గుడ్ న్యూజ్ : “విశేషమా? విశేషమే!”
అడుగేయ్ నిబ్బరంగా!
కశ్మీర రాజతరంగిణి-37
‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో -1
జీవన రమణీయం-45
పునాది
దుఃఖ నివారణకు వేదాంత మార్గం
శ్రవ్య కావ్యేతివృత్తము
సోమేపల్లి వెంకటసుబ్బయ్య స్మారక సంకలనానికై రచనలకు ఆహ్వానం – ప్రకటన
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®