[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]


81
మా రేడు, రేడులందు ప్రసిద్ధుడు
కోరాడు మంచి సైనికులను
మీరడు నియమం బలాల ఎంపికలో
కోరిన సైనికులతో బలాన్ని ఏర్పర్చుకొనె
82
రమ్మీకి రంగం సిద్ధమాయె
తమ్మీలందరూ చేరిరి ఆటకొరకు
మమ్మీలు మందలించిరి, వద్దని పంపిరి ఇంటికి
నమ్మి వస్తే ఆట సాగకపోయె
83
నిరాశ నిస్పృహలతో అనారోగ్యం దాపురించు
దురాశ చింతలకు మూలము
పేరాశ పెను ప్రమాదమే మరి
చిరు చిరు ఆశలు ఆనందం చివరకు
84
ఏమున్నది గర్వ కారణం జీవితంలో
సొమ్ము సంపాదించుటకు వుద్యోగం లేదు
కమ్ముకున్న అనారోగ్యాలతో బాధ
పోము పోము పోమంటున్నాయి రోగాలు
85
కార్చిచ్చు రగులుకొంది అడవిలో
పారిపోయె జంతువులన్నీ
తరువులన్నీ కాలిపోయే మంటల్లో
చేరింది అగ్నిమాపక విమానం మంటలార్పేందుకు
86
అడుక్కు తినేవాడికి అరవై ఆరు వూళ్ళు
దండుకొని తినే వాడికి ఊళ్లే అవసరం లేదు
రండు రండంటూ మాయ చేస్తాడు
చెండుకొని తినేస్తాడు
87
వందేమాతర గీతం వరుస మారుతున్నదా?
కందే ఎండలో నిల్చొని పాడితే అంతే మరి
పందిర్లేసి పాడితే బాగుండు
వంద మందైనా పాడగలరు
88
మంచర్ల గోపన్నకేం తెలుసు
కంచర గాడిదల గురించి వివరాలు
పంచల మూటలు ఇంటింటికి మోసుకెళ్తాయని
పంచ పంచలో అందిస్తవని
89
చేద లోన చేరు బావిలోని నీరు
వాదనలో బయటపడు అసలు విషయం
మది లోన చేరు ఎన్నో విషయాలు
కాదనలేరు వీటిని ఎవ్వరు
90
కంచి పట్టు చీరలే అతివలకందం
మంచి చీరలు లభించు బట్టల దుకాణంలో
ఎంచి యేరుకుందురు భామలు
కుచ్చిళ్ళతో కట్టుకొనిరి భామలు

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.