[గిద్దలూరు సాయి కిషోర్ గారు రచించిన ‘తరాలు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


రాబోయే తరానికి
కాస్త విలువలను నేర్పుదాం
రాబోయే తరానికి
నేస్తాలను కలుసుకోమని చెబుదాం
రాబోయే కాలానికి
నిజం మాటలు చేదుగా
అబద్ధాల మాటలు తీపిగా
వినపిస్తాయి కాబోలు
రేపటి తరానికి కంఠంతో వినిపిద్దాం
రాబోయే తరానికి
పూర్వీకుల పద్దతులు
తెలుపుదాం
రాబోయే తరానికి
న(తె)లుపు అని మానవునికి
నామకరణం చేయకండి
వారి మధ్య విభేదాలు
లేకుండా చూసుకుందాం
రాబోయే తరానికి
అన్నదమ్ముల బంధాన్ని
వివరిద్దాం కాస్త బంధాన్ని
నిలిపేవాళ్ళుగా
తోడుగా నిలుద్దాం
రాబోయే తరానికి
సాంప్రదాయాలు, ఆచారాలను
తెలుపుదాం
తెలుగు వారిగా ఈ భూమిపై
జీవనం కొనసాగిద్దాం
ఇరుగుపొరుగు వాళ్ళతో
పొట్లాటలు ఆపేద్దాం
తెలుగు వారిగా
వారి హృదయంలో
నాటుకుపోదాం
రాబోయే తరానికి
పర్యావరణాన్ని వివరిద్దాం
అందులో వారు భాగస్వాములుగా
స్వాగతం పలుకుదాం.

గిద్దలూరు సాయి కిషోర్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, రాయదుర్గంకు చెందినవారు. మురళి, లక్ష్మి గార్లు ఆయన తల్లిదండ్రులు. సాయి కిషోర్‌కు చెల్లెలు ఉంది.
కవితలు, కథలు రాయడం అంటే సాయి కిషోర్‌కు చాలా ఇష్టం. అలాగే కవితల, కథల పోటీలకు పాల్గొనడం ఇష్టం.
సాయి కిషోర్‌కు కథలు, కవితలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీరు రచించిన కవితలు మైండ్ మీడియాలో కవితా ఝరి కార్యక్రమంలో అనేక మార్లు ప్రసారమయ్యాయి. త్వరలో ప్రచురితమవబోతున్న వీరి మొదటి కవితా సంపుటి పేరు ‘జీవనం’.