“విశ్వం అంటే ఏమినా?”
“బూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అనంత ఆకాశం… అంతే కాదురా ఇదే విశ్వం అని చెప్పలేనంతగా వుండేదేరా విశ్వం అనేది”
“మడి మన బూమి అంటేనా?”
“చల్లని సముద్రం, నల్లని మేఘాలు, తియ్యని నదులు, తులతూగే అడవులు, సువిశాల నేల, కొండలు, బండలు, జంతువులు, జలజీవాలు, పులుగా పుటరా (క్రిమి, కీటకాలు), మనుషులు… ఇలా అన్ని వుండే తావేరా బూమంటే”
“ఇట్లా బూమి ఎట్ల పుట్టెనా?”
“ఎట్లని చెప్పేదిరా, ఏమని చెప్పేదిరా యీ బూమి పుట్టేకి అదేన్ని గ్రహ, నక్షత్రాలా గలాటాలు నడిసినో అదెన్ని బండలు పగలి గుండ్లు అరిగినో ఎంత అగ్గి మొలిగి (మండి) ఆవిరైనో… ఇట్ల ఎంతో కాలం నడిసినంక బూమి సల్లగా అయి మెల్లిగా ఇట్ల మారెరా”
“సరేనా, బూమి మీద జీవి పుట్టెకినా?”
“అదొక కాలములా పంచభూతాలు పరవసించి పండగ చేసుకొంటూ బూమిపైన ఎగరలాడి దుముకులాడతా ఏకకణ జీవికి ఏతమెతే, ఆ జీవి బహుకణ జీవిగా బతుకు మార్చే ఇట్ల మారి మారి నీళ్ల చరాలు పుట్టుకొచ్చె, ఆమీట నేలచరాలు నేలపైన నిలసి బలికే ఇట్లా ఎన్నెనో ఎన్నో వేల లచ్చల ఏండ్లు పరిణామ క్రమము
సాగినంక మనిషి పుట్టెరా”
“ఏలనా మనిషితాకి వొచ్చి పరిమాణక్రమము నిలసిపొయ”
“రేయ్! పరిణామక్రమములా మనిషి ఒగ భాగం అంతే, పరిణామకము నిలసిపోలే. ఇది నిలసిపోవాలంటే బూమి తిరిగేది నిలవాలా. ఇది అయ్యే పనికాదు సృష్టిలో గతి (చలనం) మార్పు సహజమురా”
“సరేనా”
***
తావు = చోటు
9 Comments
Shilpa mallikarjuna
Super sir.
Manasa
Nice
Madhu
Good story
Mallesh.
Nice story sir
Arun
Super sir
Narayana
Nice
కస్తూరి మురళీ కృష్ణ
నిజంగానే ఈ మనిషి చేష్టలు చూసి పరిణామక్రమం ఆగిపోయింది ఏమో. ఇదే నిజమేనేమో…..
జయధీర్ తిరుమల రావు
కస్తూరి మురళీ కృష్ణ
పరిణామక్రమం ఆగిపోయిందని అనుకోవడం అజ్ఞానమేనండీ, మీరు చక్కగా చెప్పారు. మనిషి అనంత విశ్వంలో ఒక భాగం మాత్రమే. తన కోణం నుంచి మాత్రం చూసి పరిణామక్రమం ఆగిపోయిందని అనుకోవడం సరికాదు.
ఉప్పలదడియం వెంకటేశ్వర్లు
Bhagyamma
Super story sir