[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~ 81. మరిచెనా యా బమ్మ; లేదు – మరచినట్లగుపించు ధరించి జీవాకృతిని, తన్ను తానే యరయు చున్నాడు; దొరకిన సుఖము దొరకు వరకు ప్రయాస – మంకుతిమ్మ!
82. మీరు రానన్నను నే వదల మిము నో బుడుతలార రారండు ఆడుదము దాగుడుమూతలాటయని కూరిమి తోడ బిలుచు నాయనమ్మవోలె, యా విరించి ఆడుచున్నాడు మనతోటి – మంకుతిమ్మ!
83. మనమున చింత నెలసిన యెడ, తానొంటరినను, నిర్వురవలె తనుదానె వదరుచు, వాదించుచు, నుడియుచు, కై సన్నల జేయుచున్, బమ్మ నొక్కడైనను తానిరువురవోలె భాసించు – మంకుతిమ్మ!
84. అణు, భూత, భూగోళ, తారాంబరముల తానె నిర్మించి, బిగించి, కొంత సడలించి తను నిర్మించిన బంతిలోన వసించి, కన్పించక మనల నర్తింప జేయుచున్నాడు బ్రహ్మ – మంకుతిమ్మ!
85. ఎల్ల లెరుగని నభోలోకము రీతినున్నదీ మనము డోలాయమానమై యూగుచున్నదీ బదుకు రెండింటి నడుము లీలా మానుషుడొక్కడే తగు నీ గాలిబుడగ నూద సలిల బుద్బుదంబు గాదె ఈ సృష్టి – మంకుతిమ్మ!
86. నింగియె నిగనిగ లాడెడి తల వెంట్రుకలై, శశితారలె పూవులై జగమె శరీరమై, మాయ తన సతియై నగవు కేరింతల పెడబొబ్బల తాండవ రూపుడే భగవంతుడు, శివరుద్రరూపుడు – మంకుతిమ్మ!
87. పెరుగుదల, ప్రకాశన, వికాసన వికారంబులు, తరుగుదల, కాంతి వేగ౦బుల కాల వృత్యాసంబులు తిరిగెడి ఈ విశ్వమందు విశ్వసమ్మోహనంబులివి, యా పరమాత్ముని లీలలే కదా – మంకుతిమ్మ!
88. మాయా భ్రమణంబులవి విశ్వచలన విస్తారంబులు – మాయ కాదది పరబ్రహ్మ విస్ఫురణమే యని తెలియు, విచారింప మాయని మెఱపు వజ్రంబున నైజంబుగ నుండునట్లు ఆ యజునకు నైజము మెరపు – మంకుతిమ్మ!
89. అనాది నుండియు వెలసియున్న ఈ జగమునకు ఎన్నగ ప్రథమ మది యెయ్యదియో అనువుగ కూర్మమది తన పాదములు చాచి ముడిచిన రీతి లోనికి నీడ్చుకున్న లయము, చాచిన యదియె సృష్టి – మంకుతిమ్మ!
90. మొదలేదీ నెలవుకి? సృష్టి పుట్టిన దెప్పుడో! మొదలేది పడిలేచెడి కడలి తరంగములకు ఏది పొలిమేర యది గాలి కెరటములకు ఆది అంతము లేవి?ఈ విశ్వమునకు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు. జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English) హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఒక సరికొత్త ప్రయత్నం – ‘సినీ కథ’
తందనాలు-4
సిరివెన్నెల పాట – నా మాట – 33 – రసజ్ఞత నిండిన పాట
కశ్మీర రాజతరంగిణి-71
ఎంత చేరువో అంత దూరము-26
ఎన్నికల కోసం
మనసును గల్లంతు చేసే “కలర్స్”
సార్వజనిక సత్యాల కవిత్వం – తురాయి పూలు
రామం భజే శ్యామలం-42
జ్ఞాపకాల పందిరి-187
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®