[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘తేనెటీగ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కమతం మీద మమత పెంచుకొని
సేద్యం ఆకలికి వైద్యమని తలచి
వ్యవసాయం చేసి సాయం చేసే
కృషీవలుడు రైతు పంటల రౌతు
ఏడాదంతా కాయకష్టం చేసి
హలం పట్టి పొలం దున్ని
అందరికీ అన్నం పెట్టే దొర
తాను గంజి తాగే నిరుపేద
మధ్య దళారుల మోసానికి
కల్తీ విత్తనాలు ఎరువుల దరువుకి
పంట చేతికొచ్చినా ఫలం దక్కని
తేనెటీగ నేటి హాలికుడు శ్రామికుడు
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.