సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    బాగున్నాయండి మీ చిన్ననాటి సినిమా జ్ఞాపకాలు…అప్పట్లో రెండు రూపాయల టిక్కెట్ తో ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం. అలాంటి ఆనందం ఇప్పుడు లేదు.. గుంటూరులో మీరు చెప్పిన రాధాకృష్ణ ధియేటర్, వెంకటేశ్వర స్వామి గుడి ఇప్పటికీ ఉన్నాయి. రాధాకృష్ణ ధియేటర్ లో పాత సినిమాలు నేను కూడా చాలా చూసాను..ఇప్పుడు హాల్ కి వెళ్లి చూడటమే మానేశాను.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. మధుసూదనరావు గారి స్పందన: *చిన్నప్పుడు నేను కూడా చాలా ఇష్టంగా సినిమాలు చూసేవాడిని. అప్పట్లో మొదట న్యూస్ రీల్ వేసేవారు. ‘ ఫిలిం డివిజన్ కీ భేంట్’ అని మొదలయ్యేది. దాని తర్వాత సినిమా స్టార్ట్ అయ్యేది. ఇంక అప్పటి నుంచీ ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేవాడిని. అయిపోయాక… ‘అరె. అప్పుడే అయిపోయిందా. ఇంకో అరగంట ఉంటే బాగుండేది’ అనిపించేది. ఇంక ఇప్పటి సినిమాల గురించి ఏం చెబుతాం? – మధుసూదనరావు.వి (హైదరాబాద్)*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వర రావు గారి స్పందన: *ఈ వారం తుర్లపాటి వారి జీవన సాఫల్యయాత్ర-12 లో ప్రస్తావించిన సినిమా విశేషాలు చిన్నతనం రోజుల్ని గుర్తుచేసాయి. ఆ రోజులలో సినిమా చూస్తే పిల్లలు చెడిపోతారనే భయం చాలామంది తల్లిదండ్రులకు ఉండేది. దేముడి సినిమాలకి మాత్రమే permission ఉండేది. మనసుని చెడుగా influence చేస్తాఏమో అనే విషయాలని పిల్లలకి దూరంగా ఉంచటానికి ప్రయత్నించేవారు పెద్దలు. తెలిసీ తెలియని వయస్సులో అది చాలా అవసరం అనిపించి. పైగా సినిమా తప్పితే entertainment పరంగా వేరే సామాజిక మాధ్యమాలు ఉండేవి కాదుకదా ఆ రోజులలో. – పరకాల రాజేశ్వర రావు ( హైదరాబాద్)*

    Reply
  4. 4

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మా నాన్నగారికి కూడా సినిమాలు ఇష్టం లేదు. ఒకసారి నమ్మినబంటు సినిమా ప్రస్తావన (చూడలేదు) తెచ్చారు. వారి ఊరు కారంచేడు కు చెందిన యార్లగడ్డ వెంకయ్య గారు తీసారని. అందులో రాముడు, భీముడు అనే రెండు బలిష్టమైన ఎద్దులు ఉన్నాయి. పాటలన్నీ సూపర్ హిట్.
    నిండు సంసారం, నిండు హృదయాలు కూడా హరిహర మహల్ లోనే చూసాను నేను కూడా. ఆరోజుల్లో గుంటూరు లో జంట ధియేటర్లు ఉండేవి. శేషమహల్ పాతది, రంగమహల్ కొత్తది. మీరన్నట్టు హిందీ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు రెండూ పడగొట్టేసారండి.
    రాధాకృష్ణ పిక్చర్ ప్యాలెస్ అని మీరంటున్నారు కానీ, డబ్బా హాల్ అనే పేరు బాగా వ్యవహారం లో ఉండేది.
    హరిహర్ మహల్ లోనే NTR, సీమా సినిమా ఏదో చూసాం. అందులో ఎన్టీర్ స్టైల్ గా ఇంగ్లీష్ పాట పాడడం గుర్తుంది. పాట, సినిమా గుర్తు లేదు.

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఇందిరా దేవి గారి స్పందన: *లవకుశ సినిమాకి వెళ్ళినప్పటి మీ జ్ఞాపకాలు చాలా బాగా గుర్తుపెట్టుకుని రాశారు. చాలా చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఆ రోజుల్లో సినిమాలకు వెళ్ళినప్పుడే ఎదురయ్యేవి. – పి. ఇందిరా దేవి (హైదరాబాద్)*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *అయ్యా! రావుగారు! 12వ భాగంలో మీరు చెప్పిన సినిమా కబుర్లు బాగున్నాయి…. మీలో మంచి కధకుడు ఉన్నాడు…. కొత్త సినిమా రిలీజైనపుడు టికెట్ల కోసం పడే పాట్లు…. నేల టికెట్… చుట్ట వాసనలు…. గూడు రిక్షాలు… మళ్ళీ తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది… లవకుశ సినిమాకి ఎడ్లబండ్లు కట్టించుకుని పక్క ఊరిలోని థియేటర్ కెళ్ళిన సందర్భాలు ఉన్నాయి…. మరిన్ని విశేషాల గురించి ఎదురుచూస్తున్నాం… అభినందనలు. – ఎం. గోపాలకృష్ణ (కాకినాడ)*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!