[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
ఉపనిషత్ సుధా లహరి
2011 వ సంవత్సరంలో ఈ లహరీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టినపుడు, “వేదాలు, ఉపనిషత్తుల మీద ఉపన్యాస లహరులు అంటూ యువభారతి వెనక్కు పోతోంది” అన్నారు ఒకాయన నవ్వుతూ. “లేదు.. లేదు.. ముందుకు పోతోంది. ముందున్నవి యేవో, వాటి గురించి వెనకాడకుండా తెలుసుకుని, ముందుకు పోయేందుకు ఆ ముందువి ఈ తరం ముందుంచుతోంది.” అన్నది దానికి నవ్వుతూనే సమాధానం.


వేదంలోని సంహిత, బ్రాహ్మణ భాగాలను ‘కర్మకాండ’ గా, ఆరణ్యకాలు, ఉపనిషత్తులను ‘జ్ఞానకాండ’ గా పేర్కొంటారు. వేదాల చివరన ఉన్నవి ఉపనిషత్తులు కనుక ‘వేదాంతం’ అని కూడా వాటికి పేరు. కర్మకాండ నుండి – జ్ఞానసముపార్జన వైపు తీసుకు వెళ్లి, బ్రహ్మవిద్య ద్వారా ఆత్మావలోకనానికి దారి చూపడం ఉపనిషత్తులు చేసే పని. ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధించాయి కానీ కర్మకాండను నిందించలేదు. అయితే కర్మకాండల ద్వారా సముపార్జించిన పుణ్యమైనా, అనుభవించిన తరువాత మళ్ళీ మనిషి పూర్వస్థితికి చేరుకుంటాడనీ, జననమరణచక్రం నుండి విముక్తుడు కాలేడనీ ఉపనిషత్తులు చెప్పి – శాశ్వతమైన మోక్షం గురించి జ్ఞానబోధ చేశాయి. సృష్టి తత్త్వ రహస్యమెరిగిన నిజమైన మత తత్త్వానుష్టానమే మోక్షం. ఉపనిషత్కర్తలు చరిత్ర జ్ఞానం వున్నవారు. కర్మకాండల వెనుక గల అసలు పరమార్థం చెప్పి, ఆ పరమార్థ జ్ఞానం పొందమనీ, అందువల్ల అసలు ప్రయోజనమనీ సమాజానికి హితవు చెప్పారు.


ఏది తెలుసుకోవడం వాళ్ళ, మరేదీ తెలుసుకోవలసిన అవసరం లేదని తెలుసుకుంటామో, నీ, నా అన్న భేద భావాలు మరచి, అంటా ఒక్కతెననే భావనతో విశ్వమాన సౌభ్రాతృత్వాన్ని అర్ధం చేసుకోగాలుగుతామో, ఆ ప్రయాణానికి ఉపనిషత్తులు దారి చూపి తీసుకు వెళతాయి.
మన ఉపనిషత్తుల గురించి సమగ్రమైన పరిజ్ఞానం కలగాలంటే – ఈ క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ చిన్న పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://archive.org/details/upanishath-sudhalahari-2/mode/2up
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.



శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.