సంచిక పాఠకుల కోసం శ్రీ వారాల ఆనంద్ రచించిన 8 హైకూలను అందిస్తున్నాము
1)
పువ్వునీ పరిమళాన్నీ మనసారా ప్రేమించా
కాలం పువ్వుని లాక్కెళ్ళింది
పరిమళం నాతో ఉండిపోయింది
========================
2)
చెట్టు మొదట్లో కూర్చుని
ఎదిగిన కొమ్మల్ని చూస్తున్నా
అవేమో దయతో పూల వర్షం కురిపించాయి
=====================
3)
ఆకాశంలో నడిపిన హరివిల్లు విరిసింది
నీటిలోంచి ఎదిగిందా నింగి లోంచి దిగిందా
ప్రేమ ఎక్కడ పుట్టిందో ఎవరు చెప్పగలరు
====================
4)
నా గురించి నీకంతా తెలుసు
మనసు తప్ప
నీ గురించి నాకేమీ తెలీదు
మనసు తప్ప
==================
5)
నేను నిన్ను ఇష్ట పడ్డానో
నువ్వు నన్ను ఇష్టపడ్డావో
ఇష్టపడటమే గొప్ప ఇష్టంగా వుంది
===================
6)
అలుపెరుగ కుండా గాలి నన్ను చుట్టేస్తుంది
వస్తూ వస్తూ పత్రహరితం నుండి
ప్రాణాన్ని మోసుకొస్తోంది
===================
ఎవరో తలుపు తట్టిన చప్పుడు
ఇంటి తలుపా
గుండె తలుపా
======================
7)
ఆకాశం లో
బారులు తీరిన పక్షులు
కుంచె గీసిన గీతాలు
లేత కిరణాల ఊసులు
==================
8)
మానేరు కట్టపై నావీ నీవీ
అడుగుల సవ్వడి
నీటి అలలు ప్రతిధ్వనిస్తున్నాయి
==================

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
2 Comments
Muralikrishna
Responses on varala anand hyku
Manassu kavitwam manussupetti raastunnaru abhinandanalu
-Dr. Vijaymohanreddy,MD Physian
హైకూలు ఇప్పుడే చదివిన. చాలా బాగున్నవి.-ఒద్దిరజు ప్రవీన్ కుమార్ .
Sanchika is good and very good
⁃ B,Rajamouli Rtd Lecturer
⁃
హైకూలు బాగున్నాయి.-Dr T Radhakrishnamaa charya
—–.
ఆనంద్ హైకూలు గుండె తలుపులు తడుతున్నాయి -జుకంటి జగన్నాధం కవి
———–
హైకూలు తాత్వికంగా బాగున్నాయి – Dr Gandra Laxman Rao, poet
—–
మనసు పూసిన మల్లెలు
-Dr Diwakara chary Rtd Principal
——–
పువ్వును పరిమళాన్ని మనసారా ప్రేమించా
కాలం పువ్వును లాక్కేళ్ళింది
పరిమళం నాతో ఉండిపోయింది
Wonderful expression
⁃ Maddikunta Laxman,poet
గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
హైకూలు బాగున్నాయి సార్..