వాడెప్పుడూ అంతే –
కస్సు బుస్సులాడుతుంటాడు
తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు
చిర్రు బుర్రులాడుతుంటాడు!
అసహనంతో అరుస్తుంటాడు!
మనసులో అతి ప్రేమను కూడా
ద్వేషంగానే వ్యక్తపరుస్తుంటాడు!
ఏ విషయానికీ సానుకూలంగా స్పందించడు
పాజిటివ్ థాట్‌ను కూడా
నెగటివ్ మూడ్‌లోనే చెబుతాడు!
అన్నీ అపసవ్య సమాధానాలే!
అన్నీ అపహాస్యాలే!
అంతా విరోధాభాసే!
అంతా విలోమ భాషే!
అతనిది అదో స్టైల్
అతనిది అదో స్మైల్
నవ్వనేది ఆ మోములో
ఒన్స్ ఇన్ ఎ బ్లూ మూన్!
కోపం ఎక్కువైతే అర్ధాయుష్కుడౌతాడని
వాడికెలా వివరించాలి!
మనసు మంచిదే, గుణం మార్చుకోమని
ఎలా చెప్పాలి!
అతన్ని అర్థం చేసుకొనేవారు తక్కువ
అపార్థం చేసుకొనేవారే ఎక్కువ
అందుకే – అందరికీ విరోధిగానే కనిపిస్తాడు
ఒంటరిగానే మిగిలిపోతుంటాడు!

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.
3 Comments
Thumma Janardhan
Excellent sir. Negative Personality and Positive Love.
Mee kavitaavishkarana adbhutam sir. Namaskaraalu.
Goutham Gundarapu
విభిన్న పాత్రుడైన వ్యక్తిికి ఎవరు సార్ తోడుండేది…
పెద్ద మనసు మహోన్నత దృష్టి కలిగిన వాళ్ళు ఓపిక కలిగి, వాళ్లు మాత్రమే ఆ మనిషిని మార్చగలరు
కానీ ఈ కవిత ఎన్నో సత్యాలు ఉన్నాయని భావిస్తున్నాను.
మహా అద్భుతం……..

Pavan
I saw exactly this personality very closely. No exaggeration as it is applicable to him.