సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    శ్రీనివాసుడు

    విశ్వనాథవారు వారికి అందుబాటులోకి వచ్చిన చరిత్రను బట్టి ఆయా ముస్లిం దురాక్రమణదారులు అనబడెడు రాజుల పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలు అవి. విశ్వనాథవారు కీర్తించినది*ఉమ్మడి సంస్కృతి*ని అని సమర్థించేవారు మీరు ఉటంకించిన విశ్వనాథవారి చారిత్రక అవగాహనలోని పొరపాట్లను ముందుగా సప్రమాణంగా చూపించాలి. అలాగైతేనే వారి సమర్థనకు ప్రామాణికత ఉంటుంది.
    నాకు తెలిసినంతవరకూ అక్బర్ వ్యక్తిత్వం, హిందూద్వేష చేష్టల గురించి విశ్వనాథవారి చారిత్రక అవగాహన తప్పు. అక్బర్ కూడా హిందూ కాఫిర్లు ఎంతోమందిని ఆనందంగా నరికించినవాడే, గుడులను ధ్వంసం చేసినవాడే. ఎవరికైనా కావాలంటే చారిత్రక ఆధారాలు యిస్తాను.

  2. 2

    Halley Kalyan

    Reacting to:

    [Link deleted]

    ఇది నేను ఇది వరకే చదివాను. దీనిలో కొన్ని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మ్రోయు తుమ్మెద గురించి వ్యాసం రాసినప్పుడు మరొక్క సారి చదివాను.

    వలసవాదం పట్ల విశ్వనాథ విమర్శతో ఏ పేచీ లేదు.
    చిక్కల్లా ఇక్కడ వస్తుంది…

    “శ్రీపాద, విశ్వనాథ యిద్దరూ కూడా సుదీర్ఘ ముస్లీం పాలనలో కాదు, యింగ్లీషు పాలనలోనే సంస్కృతికి ముప్పు వచ్చిందని భావించారు (అనుభవాలూ-ఙ్ఞాపకాలూ , మ్రోయు తుమ్మెద )”

    “…లోనే..” తోనే సమస్య.

    ఇంగ్లీషు పాలనలో ముస్లిం పాలన కంటే కూడా మనం మన స్వత్వాన్ని ఎక్కువగా కోల్పోయాము అంటాడు విశ్వనాథ మ్రోయు తుమ్మెదలో. అంటే ముస్లిం పాలన స్వర్ణ యుగం అని కాదు అర్థం. మ్రోయు తుమ్మెదలో ఇస్లాం పాలనను విమర్శిస్తూ ఆ పాలకుల కాలంలో జరిగిన దుర్మారాల గురించి చాలానే రాశారు.

    ప్రత్యేకంగా హిందూ రాజ్యాలయిన విజయనగర సామ్రాజ్యం గురించి శివాజీ సామ్రాజ్యం గురించి కూడా ప్రస్తావించారు . కాబట్టి ఆయన ఇస్లాంను పల్లెత్తు మాట కూడా అనలేదు. కేవలం ఇంగ్లీషు పాలనను మాత్రమే విమర్శించాడు అనటం సరికాదు.

    “చారిత్రకంగా వొక పరాయి జాతి మనలని అణచి వేసిందన్న భావన వీరిలో మచ్చుకైనా కానరాదు”…

    ఇది కూడా తప్పు. మ్రోయు తుమ్మెదలో, శివాజీ రోశనార చారిత్రక నాటకంలో, ఆయన పరిష్కర్తగా ఉన్న వక్ర రేఖ నవలలో ఎన్నో ఉటంకింపులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఇస్లాం పాలన ఆంగ్లేయుల పాలన రెండు కూడా పరాయి పాలన కిందే జమకట్టారు విశ్వనాథ. ఇస్లాం పాలన అంటే సొంత పాలన కేవలం ఆంగ్లేయుల పాలన మాత్రమే పరాయి దేశపు పాలన అని ఆయన అనలేదు.

    “…హిందుస్థానీ భక్తి సంగీతంలో ముస్లీం మతస్థుల పాత్రని గురించి విశ్వనాథ “మ్రోయు తుమ్మెద”లో స్పష్టం చేశారు. మ్రోయు తుమ్మెదలో తెలుగువాడైన “తుమ్మెద” హిందుస్థానీ సంగీతంలో పాండిత్యాన్ని సంపాదిస్తాడు. నీవు పాడే పద్ధతి తురక పద్ధతిలో ఉందని వొక హిందుస్థానీ పండితుడు ఆక్షేపించినపుడు ముస్లీంలు లేకుండా హిందూస్థానీ ఉందా అని అడుగుతాడు తుమ్మెద…”

    తుమ్మెదకు ఒక స్త్రీ మూర్తికి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఆమె సంగీత విద్యా స్వరూపమని గాన విద్యా సరస్వతికి ప్రతి రూపం అని కూడా గుర్తిస్తాడే తుమ్మెద. తాను కారగారము లో చిక్కుకున్నాను అని అంటుంది ఈ స్త్రీ మూర్తి. తనను చెర నుండి విడిపించమని అంటుంది.

    “నీవు సామగాన నిపుణుడైన బ్రాహ్మణుని కుమార్తెవా? సామవేదము నందుండి పుట్టిన లయానుకూలమైన, సప్త స్వర మేళన జనితమైన యొక నాదవిద్య వంటి బాలికవా? నిన్న తడు చేరయందుంచెనా?.. నీవు తురుష్క బాలిక వలె పెంపబడితివా? నీ ఆత్మ మాత్రం వేద వాసనను వదిలి పెట్టుట లేదా? …”

    ఇలా సాగుతుంది తుమ్మెద సంభాషణ ఆ గాన విద్యా స్వరూపమైన స్త్రీ మూర్తి తో. తురుష్క ఛాయ అనే చెర నుంచి విడిపించి శాస్త్ర అభ్యాసం చేసి తిరిగి వేద శాస్త్ర పునాదుల పై సంగీతాన్ని నిర్మించమని తుమ్మెదకు ఆ స్త్రీ మూర్తి చెబుతోంది.

    ఇది విశ్వనాథ హిందుస్థానీ సంగీతంలో తురుష్క పాలన ప్రభావాన్ని చూసిన తీరు. ఇదంతా వదిలేసి విశ్వనాథ హిందుస్థానీ సంగీతానికి ముస్లిములకు ఉన్న అనుబంధం గురించి మాత్రమే రాశాడు అనటం సబబుగా లేదు.

    “మతాంతరీకరణ పట్ల వుద్వేగాన్ని విశ్వనాథ అనుభూతి చెందడు”
    ఇది కూడా తప్పు. వివరాలు నేను రాసిన వ్యాసంలో ఉంది.

    “..అంతర్వాహిణిలా సంస్కృతి కొనసాగుతూనే ఉంటుందని ఆయన భావన”
    దానికదిగా నిలబడదు. మనం దానిని పట్టించుకోవాలి కదా. స్వ అనేదాన్ని గుర్తిస్తే అప్పుడు దానిని పట్టుకు వ్రేలాడతాము. అసలు స్వ సంస్కృతి అనే భావననే వదిలేసి ఇస్లాం సంస్కృతి కూడా శుద్ధ భారతీయమైన సంస్కృతే కదా. అంతా సనాతన ధర్మమే అని అంటే అది విశ్వనాథకు వక్ర భాష్యం చెప్పినట్టే.

    “అందుకే తెలంగాణా గురించి రాసినా ముస్లీంపాలన, ఉర్దూ విద్యల గురించి వ్యతిరేకంగా మాట్లడడు”
    ఇది కూడా తప్పు. మ్రోయు తుమ్మెదలో చాలా చోట్ల ఉర్దూ విద్య మీద విమర్శలు ఉన్నాయి. ఉర్దూ తెలుగు రెండిటినీ ఒకటే గాటన కట్టలేదు విశ్వనాథ. ఉర్దూ నేర్చుకున్న కొడుకు గురించి బ్రాహ్మణ దంపతుల మధ్యన సంభాషణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాను నేను నా వ్యాసంలో.

    “ముస్లీం దాడుల వల్ల సంస్కృతికీ, ధర్మానికీ యేదో నష్టం జరిగిపోయిందన్న ఆవేశమూ కనపడదు”
    ఇది కూడా తప్పు. వక్రీకరణ. దీనికి విరుద్ధంగా ఎన్నో వాక్యాలను ఉటంకించాను నేను నా వ్యాసంలో.

    “పైగా మన లోపాల వల్లే సంస్కృతికి ముప్పు అని ఆయన భావనలా కనిపిస్తుంది.

    అరిపిరాలలోని శిథిల శివాలయము గురించి విశ్వనాథ యిలా వ్యాఖ్యానిస్తాడు.

    “ముసల్మానులు ఆ దేవాలయమును నాశనము చేసిరి. వారు చేసిరని వీరు చెప్పుదురు. అది యొక అపప్రధ యేమో. వీరే తమ నిరాదరణ భావము వలన తమ మతము నందు తమకు గాఢమైన అభిమానము లేకపోవుట వలన తమ దేవతలను తిరస్కరించి, నాశనము చేసుకొని నింద ముసల్మానుల మీద మోపుచున్నారేమో ….” ( మ్రోయు తుమ్మెద ).

    నిరాదరణ భావం, అభిమానంలేకపోవడం వల్లనే సంస్కృతికి వినాశనం జరుగుతుంది. కానీ బలవంతపు మతమార్పిడులు, దాడుల వల్ల కాదు. వలసవాదం ఈ నిరాదరణ భావాన్ని పెంచుతోంది. అదే సాంస్కృతిక సామ్రాజ్యవాదం”

    దీని గురించి కూడా నేను వ్యాసంలో ప్రస్తావించాను.

    “విశ్వనాథలో, జాషువాలో, శ్రీపాదలో జాతి విద్వేషపు చాయలు కనపడవు. దానికి కారణం చారిత్రక నిర్లిప్తతే”

    విశ్వనాథలో నిర్లిప్తత ఏమీ లేదు. స్వజాతి పరజాతి అనే విచక్షణ ఆయనకు ఉంది. దీని గురించి కూడా నేను నా వ్యాసంలో రాశాను.

    “నిజానికి ధర్మారావులో ఎక్కువశాతం యీ నిర్లిప్తతా భావమే రాజ్యం చేస్తుంది ధార్మికవిషయాల్లో. ఇతర మతాల్ని ఢీకొనడం కనపడదు”
    విశ్వనాథ రాసిన శివాజీ నాటకం చదవండి. దాని గురించి కూడా వ్యాసంలో రాశాను. చేతులు కట్టుకు కుర్చోవయ్యా రాజు ఎవరైతే మనకేంటి అని చేతకాని తనం బోధించలేదు విశ్వనాథ. మ్రోయు తుమ్మెదలో కూడా ఇస్లాం రాజులకు వ్యతిరేకంగా పోరాడిన హిందూ రాజుల పోరాట పటిమను స్ఫూర్తిని మెచ్చుకున్నాడు. ఈ వివరాలు కూడా నేను రాసిన వ్యాసంలో ఉన్నాయి.

    “సాంస్కృతిక సాంకర్యంలేని స్వచ్చమైన గతాన్ని విశ్వనాథ స్థాపించలేదు. మ్లేచ్చ సంపర్కాన్ని కప్పిపుచ్చలేదు. పైగా దానివల్ల సంస్కృతి విచ్చిన్నమైపోయిందని ఆయన ఏనాడూ ప్రతిపాదించలేదు”

    ఇది కూడా వక్రీకరణ. విశ్వనాథ సాంకర్యాన్ని సాంకర్యంగా గుర్తించాడు. ఆయనలో సాంకర్య వ్యామోహం లేదు. ఉంటే స్త్రీ మూర్తి రూపంలో వచ్చిన సరస్వతి చెర విడిపించే ప్రస్తావన తేవలసిన అవసరమే లేదు. సాంకర్యం అంటే అంత మోజు ఉంటే అసలు చెర అనే పదం ఎందుకు వాడటం.

    మీకు వలసవాదం ఆంగ్లేయుల పాలన గురించిన విమర్శ మాత్రమే కావాలి విశ్వనాథలో. ఇస్లాం శుద్ధ వైదిక సంస్కృతి సనాతన ధర్మానికి మూల స్తంభం అని మీ అభిప్రాయం అవ్వచ్చు. అది విశ్వనాథ అభిప్రాయం కాదు. అందుకే ఆ విషయం విపులంగా వివరించాలని ఈ వ్యాసం రాశాను.

    [Link deleted]

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!