[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘ఓటరుబ్రహ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఎన్నికల ప్రవాహంలో
అధికారతీరం కోసం
నాయకుల ఈతల పోటీ!
వెల్లువలో వారి సుడి తిరుగుతుందో!
గుండంలో పడి మునుగుతుందో!
ఎవరికెరుక! దేవుడి దయ!
పాదయాత్రలూ, కంఠశోషలూ
చూస్తూ విలాసంగా నవ్వే
ఓటరు దేవుడు
ఆ తోలుబొమ్మలాటల్లో
బంగారక్కాతమ్ముళ్ళ బాగోతం
వినోదించే ఆనందమూర్తి
పదవులూ, పైత్యాలూ
ప్రలోభాలూ, ప్రకోపాలూ
వంటి ఈతిబాధల్లేని జ్ఞానమూర్తి
ఎవరు పాలించినా తేడా పడక
తన రెక్కల్నేనమ్ముకుని
గండాలు దాటే దేవతామూర్తి
ఉచితాల వేలం పాటలో
గెలిచి పీఠమెక్కిన వాడు
తాయిలాల ఊబిలో మునిగినా
ప్రజల్ని ఏమార్చబోయిన
భస్మాసురులు
ఓడి, శాపాలకు తెగబడినా
నోరు మెదపని మౌనమూర్తి
ఐదేళ్లకొకసారి ఓటుతో వారి
తలరాతలు రాసే వివేకమూర్తి

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
6 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
కవిత ఎత్తుగడ నే అడిరిపొయింది
మంచి వస్తువు తీసుకుని చక్కని
అర్ధవంత మైన కవిత రాసారు.
మీకు అభినందనలు /శుభాకాంక్షలు ,
మేడం.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
అల్లూరి Gouri Lakshmi
Thanku Prasad గారూ
పుట్టి నాగలక్ష్మి
ఓటర్ నిజంగా బ్రహ్మే! రాబోయే ప్రభుత్వ సృష్టికర్త కదా! మంచి కవిత రాశారు గౌరీలక్ష్మి గారు. అభినందనలు.
అల్లూరి Gouri Lakshmi
Thanku నాగలక్ష్మి మేడం.
కొల్లూరి సోమ శంకర్
ఇది రమ్య గాయత్రి గారి వ్యాఖ్య















*
*Srimathi gouri laxmi garu vrasina otaru brahma naku chala baga nachesidhi andhu jarige vasthavalu manam chusthune unnamu election lo vese matalu thutalu mana kallamundhu jaruguthunnaiga ala nijalu vrasina gouri gariki abhivandhaniyame
కొల్లూరి సోమ శంకర్
Mee Kavita ‘Voterbrahma ‘ chala bavundi, Nayakula teeru, Voter gurinchi chala baga chepparu. Hearty Congratulations. Ma viyyakudiki hearty surgery valana busyga vundi respond kaleka poyanu, sorry for the delay.



రాజేంద్రప్రసాద్