సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*భువన్ జీ, “ఫర్ ఎవ్వరీ ఎండింగ్ దేరీజ్ ఏ బిగినింగ్ వెయిటింగ్ ఫర్ యు”
    ఎంత నిత్య సత్యాన్ని చెప్పారండి!
    లేకుంటే ఎక్కడి చింతలపూడి.. ఎక్కడి బాంబే మహబూబ్ స్టూడియో! బహుశా కేవలం సినిమా పాట కాకుండా క్రమక్రమంగా మీ మనసులో ఎప్పటినుంచో ఉన్న ఆశలు, ఆశయాలు మెల్లమెల్లగా తెరుచుకుంటూ మిమ్మల్ని శిఖరాగ్రాన నిలిపే మార్గం ఏర్పడుతోంది. దానికి మీ అనురక్తి తోడ్పడింది. అంతేకాక మీ శ్రమ, కష్టం, బహుశా ప్రతి రక్త బిందువుని ఉత్తేజపరిచే ఉత్సాహం, అంకితభావం కారణం కావచ్చు.
    పెద్దరికంలో ఇదేలే తరతరాల.. పాట, భారతీయుడులో పచ్చని చిలుకలు.. పాట మిమ్మల్ని తెలుగు సినీ గేయ రచయితగా ఎప్పటికీ ఉన్నత స్థానంలో ఉంచేవి.
    డిక్కీ డిక్కీ పాట నిజంగానే చాలా కాంట్రవర్షియల్ అవటం నాకు బాగా గుర్తుంది.
    ఎవరెవరి ఊర్ల పేర్లతో కలిపి పాట రాయటంతో ఎవరికి వారు ఓన్ చేసుకున్నారు, హిట్ చేసారు ప్రేక్షకులు కూడా.
    రత్నం గారి గురించి, మహబూబ్ ఖాన్ గురించి వివరాలు మీరు చెప్తేనే కదా మాకు తెలిసింది ఇప్పుడు!
    నిజానికి ఈ రచన కేవలం సినిమా పాటల గురించి కాదు – పాఠకులకు తెలియని సినీ లోక విశేషాల చరిత్ర!*

    Reply
  2. 2

    Rama Sundari M S B P N V

    మీరు రాసిన ప్రతి పాటకీ వెనక గొప్ప నేపథ్యం ఉంది. మీకు సంతోషం కలిగించిన పెద్దరికం పాటకి…ఇదేలే తరతరాల చరితం…తెలుగు లోకం బ్రహ్మరథం పట్టింది. ఇక రౌడీ ఇన్స్పెక్టర్ పాటలు కూడా బ్రహ్మాండమైన బీట్ కాబట్టి ఎక్కడ చూసినా ఈ పాటలే వినబడేవి ఆ క్యాసెట్ల కాలంలో. హేమాహేమీలతో కలిసి పనిచేశారు కాబట్టే ఆ పాటలూ, స్వరాలూ, గాయకులూ అందరికీ పేరొచ్చింది. నచ్చిన పని చేయడం, దానితో బాటు పేరు ప్రతిష్ఠలు కూడా రావడం అంటే జీవితం సార్థకమైనట్టే కదా. బప్పీలహరి గారితో మీరు చేసిన పాటలన్నీ ఎంతో బాగున్నాయి. రౌడీ ఇన్స్పెక్టర్ చూడలేదు. ఇప్పుడు చూడాలి. విజయశాంతి చిరంజీవితోనూ, బాలకృష్ణతోనూ చేసిన సినిమాల్లో పాటలు బాగుంటాయి. విజయశాంతి అంటే… ఇంద్రుడు చంద్రుడు…సాయంకాలపు సరిగమలో పాటలో ఆమె అభినయమే కళ్ల ముందు కదులుతుంది. అంటే విజువల్ గా చూడడానికి ఆ డ్రెస్, ఆ స్టెప్స్ లో బాగుంటుంది.
    మీరన్నది కరెక్ట్. మొదలయ్యేది ముగిసేదే, ప్రతి ముగింపూ మరి దేనికో ప్రారంభమే.
    ప్రతిభావంతులు, సినిమా పట్ల passionate గా పనిచేసేవాళ్లని సినిమాయే ఎంచుకుంటుంది. అలా మీరు సినిమా చేత ఎంచుకోబడ్డారు.
    చండి (రమాసుందరి)

    చండి (రమాసుందరి)

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *దీపావళి శుభాకాంక్షలు 🙏 మీరు వ్రాసినవి చదువుతున్నంతసేపూ వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది. నాకు ఏమీ తెలియదు కానీ మరెన్నో విషయాలు తెలుసుకున్నాను అని అర్థం అయింది నాకు అనిపించింది. మీకున్న ఏకాగ్రత పట్టుదల మరియు మౌనం తోటి మీకు మీరు జీవించడం అనేది భగవంతుడు తోడు కలసి మీ జీవితాన్ని అంకితం పాటకు మీ ప్రతిస్పందనా పాఠకులకు పంచిపెట్టి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసి చిరునవ్వుతో చిరంజీవిగా ఎదిగి మీ జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దు కున్నారు ధన్యవాదాలు అభినందనలు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంగళ కందూర్ గారి స్పందన: 19వ సంచిక చదివాను. పెద్దరికం సినిమా లోని “ఇది తరతరాల చరిత”అనే పాటలోని రెండవ చరణం నాకు చాలా బాగ నచ్చింది. A.V.రత్నం గారి సినిమాలంటే బాగుంటాయి అనే అభిప్రాయం నాలో పడిపోయింది. దాసరి గారు అయ్యప్ప భక్తులు. తమ సినిమాలో చక్కటి అయ్యప్ప భజనలు పెడుతుంటారు.
    ప్రియతమా పాటను చక్కటి ప్రాస తో చాలా బాగ వ్రాశారు మీరు. వీలైతే పెద్దరికం మొమెంటో ఫోటో పెడ్తారా..
    బప్పిదా అంటే డిస్కో సంగీతం,ఆయన వేసుకొనే బంగారు నగలు గుర్తుకొస్తాయి.
    మీరు పాటలను అలవోకగా వ్రాస్తారని అనిపిస్తుంది.కాని దాని వెనక మీ కృషి వుందని తెలుసు.పైగా దేవుడు ఇచ్చిన వరం కూడ.
    మెహబూబ్ ఖాన్ ను,అతని మదర్ ఇండియాను ఎవరూ మరచిపోరు.
    మీరు మాకు చాలా పాత విషయాలను గుర్తు చేస్తున్నందులకు ధన్యవాదాలు.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కాంతారావు గారి స్పందన: *మీ సినీ జీవన ప్రస్థానం అద్భుతం. గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం,వారితో కలిసి పనిచేయడం ఒక గొప్ప అదృష్టం. వారి మెప్పు పొందటం మీ ప్రతిభకు గీటురాయి. మనఃపూర్వక అభినందనలు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మోహన్ గోటేటి గారి స్పందన: *ముంబైలో మెహబూబ్ స్టూడియోలో అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురై, మెట్లకు మీ నుదుటిని ఆనించి, పులకించడం అన్నది హృదయాలను టచ్ చేసింది. మెహబూబ్ స్టూడియో బాలీవుడ్ కి పవిత్ర దేవాలయం లాంటిది. అందుకే, మీరు ఒక కవిగా అంతగా మూవ్ అయ్యారు. రౌడీ ఇన్స్పెక్టర్ పాటలు సూపర్ హిట్. చిత్ర విజయానికి ఎంతో హెల్ప్ అయ్యాయి. చిరంజీవిగారితో పాటు బాలకృష్ణ గారికి కూడా హిట్ పాటలు రాసిన క్రెడిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత మీరు దూసుకుపోయారు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®