ప్రయాణాలు అత్యవసరమైన కష్టమని నీవు మానుకుంటే
చదువులెన్నో చదవాల్సివచ్చిన శుద్దదండుగని నీవు వూరుకుంటే
క్రొత్తతలపులెన్నో ఉదయించిన మనసుర్రూతలూగినా నీవు వినకుంటే
మమతరాగాలెన్నో వసంతగానాలైన వయసల్లరిచేసినా నీవు తెలియకుంటే
నెమ్మదిగా నీవు నిస్తేజమవుతున్నట్టే మరణానికి నీవింక చేరువవుతున్నట్టే
ఆత్మగౌరవాన్ని అంతర్మధనాన్ని ఆత్మీయతను నీవు సమాధిచేసుకుంటే
ఎదుగదలలో బ్రతుకునెరుపుటలో జీవనయాత్రలో నీవు మేధావినుకుంటే
చెడ్డలవాట్లకు దుర్వ్యసనాలకు దుర్భాషలకు నీవు దుర్భరబానిసైతే
మార్పుచెందక తీరుతెన్నుమార్చుకోక తప్పుదారిలో నీవు వద్దన్నపోతుంటే
నెమ్మదిగా నీవు నిర్వీర్యమవుతున్నట్టే మరణానికి నీవింక చేరువవుతున్నట్టే
జీవితరంగులను ఆస్వాదించలేకపోతే కొత్తొళ్ళసాంగత్యాన్ని నీవు నచ్చలేకుంటే
కళ్ళల్లోమెరుపులను కారణామైనవార్ని మమతలను నీవు దూరంచేసుకుంటే
హృదయపుగొంతులను నొక్కిపెట్టేస్తే రసస్పందనలకు నీవు నిర్లక్ష్యంవహిస్తే
ఉద్యోగపుభారాన్ని బరువుగామోస్తుంటే నచ్చని నౌఖరిని నీవు తోసిరాజనకుంటే
నెమ్మదిగా నీవు విఫలమైనట్టే మరణానికి నీవింక చేరువవుతున్నట్టే
తీరునచ్చనిచోటును మెచ్చలేకపోతుంటే మనసైనట్టు నీవు మార్పుచేసుకోకుంటే
ఒప్పలేనివలపుని తప్పలేకపాలిస్తుంటే అనిశ్చితభీతితో గెలుపుదారినివీడితే
కలలదారంటా కడదాకసాగకుంటే తప్పుడుసలహాకార్ల తాటతీయకుంటే
బ్రతుకునావను సరిదిద్దుకోకుంటే ఆనందాలజలధిలో ఓలలాడకుంటే
నెమ్మదిగా నీవు నీరసపడిపోతుంటే మరణానికి నీవింక చేరువవుతున్నట్టే
స్వేచ్ఛానువాదం అయినా కవి ఎక్కడా భాష, ప్రాసల విషయంలో వెనుకంజ వేయలేదు..ముఖ్యంగా కవితకి ఎన్నుకున్న టైటిల్ బాగుంది.. జీవితంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం కావించుకోవాలి, ప్రతికూల దృక్పధాన్ని అలవర్చుకోవాలి, తన కలలిని, అభిరుచులను చంపుకో కూడదు, ప్రతి విషయానికి స్థానం ఇవ్వాలి అన్న ఒక్క ఆధ్యాత్మిక సందేశం ఉంది..యువతకి ఎంతో ఉపయోగపడే , ప్రేరణ ను అందించే సందేశం ఇది.. రాధా రాణి పూజారి, ముంబై
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నూతన పదసంచిక-38
సంచిక – పద ప్రతిభ – 68
సత్యాన్వేషణ-27
గాలి ఎంత గొప్పదో!!
కీ.శే. ఆచార్య వెలమకన్ని భరద్వాజ గారి స్మృత్యర్థం నిర్వహించే కథల పోటీకి ఆహ్వానం – ప్రకటన
‘వారణాసి’ – పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం
ప్రాంతీయ దర్శనం -18: మణిపురి – నేడు
అన్నింట అంతరాత్మ-18: పరిమళంతో అలరించే ‘చందనాన్ని’ నేను!
సాగర ద్వీపంలో సాహస వీరులు-7
బ్రిటిష్ బంగ్లా-2
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®