అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, యవ్వన ప్రాంగణం లోనికి అడుగుపెట్టాక శరీరం వాళ్ళని ఓ పట్టాన నిలువనీయదు. శరీరంలో వయసుతోపాటు అనేక మార్పులు వెంటనడిచి వస్తాయి. అలాంటి వయసు మనిషిని కుదురుగా నిలువనీయదు. ఆడపిల్లల విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎందుచేతనంటే, వాళ్ళ శరీరంలో కలిగే మార్పులు కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టినప్పటికీ, వాళ్ళల్లో వయసుతోపాటు వచ్చే సహజమైన ఆకర్షణ మగపిల్లల దృష్టిని వారివైపు మరలుస్తాయి. మంచి మాటలతో దగ్గర కాలేని వారు, ఏదో రూపంలో అల్లరి చేయడం, పేర్లు పెట్టి పిలవడం, వారివైపు ఆడపిల్లలు ఆకర్షింపబడేలా యేవో కోతి చేష్టలు చేసి ఆడపిల్లలను మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. ఇలా.. పెరుగుతున్న, వయసొచ్చిన ఆడపిల్ల రెండురకాల ఇబ్బందులకు గురి అయ్యే ప్రమాదం వుంది. ఇలాంటి అల్లరి మూకలపైన ఎంత నిఘా ఉంచినా, ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో అమాయకులైన ఆడపిల్లలపైనా నిత్యం ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు ఇదొక పెద్ద సవాల్!
దీనికి భిన్నంగా చదువుకునే కాలంలోనే, అతి చిన్నవయసులో ఒకరికొకరు ఆకర్షింపబడి, వయసుపెట్టే అల్లరికి ఒకరికొకరు దగ్గరై దానికి ‘ప్రేమ’ అని పేరు పెట్టేసుకుని, ఆ మాయలో పడి పగటికలలు కంటూ, ఊహాలోకంలో జీవించేస్తుంటారు. అంతవరకూ బాగానే ఉంటుంది కానీ, తర్వాత ఎదురయ్యే పరిణామాలు కొందరిని నిరుత్సాహపరిస్తే, కొందరు తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాలనే పోగుట్టుకుంటారు. ప్రేమికులిద్దరూ ఒకే కులం, ఒకే మతం వారైతే ఆర్థిక పరిస్థితులు పెద్దగా అడ్డు రావు. అయినా, ఇలాంటి వారిలో నూటికి నూరు శాతం ప్రేమ నుండి పెళ్ళికి దారి తీసే అవకాశాలు బహుతక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఊబిలో దిగి చదువుకు స్వస్తి పలికినవారు ఎందరో వున్నారు. ఇకపోతే, కులాంతర, మతాంతర, ప్రాంతీయేతర ప్రేమలు పెనుసవాళ్లను ఎదుర్కోవలసిందే!
ఎవరో విశాల హృదయం వున్నతల్లిదండ్రులు తప్ప, వేరే వాళ్ళు ఎవరూ ఇలాంటి ప్రేమలూ -పెళ్ళిళ్ళను ప్రోత్సహించరు, వెనకేసుకు రారు. ఇక్కడే చిక్కులు ఏర్పడుతున్నాయి. సాహసించినవాళ్లు గువ్వల్లా ఎక్కడికో ఎగిరి పోవడం, గుండెధైర్యం లేనివాళ్లు క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకోవడం నిత్యం మనం వింటున్న విషయాలే! అయితే, ఈ ప్రేమ పిచ్చిలో కుటుంబ నేపథ్యాలు అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా, పరిగణనలోకి తీసుకోకుండా సాహసించినవాళ్లు, తర్వాత అనేక ఆర్థిక సామాజిక ఇబ్బందుల్లో ఇరుక్కోవడమో, వదలలేక, కదలలేక, అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారుకావడమో, ఏమీ చేయలేని పరిస్థితిలో ఏదో అఘాయిత్యానికి పాల్పడడమో, లేదా ఏ దిక్కూ తోచక తిరిగి అయిన వారిని చేరడమో జరుగుతుంటాయి.
ఇలాంటి సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు మనం ఏమి చేస్తాం?ఎవరి గురించో ఎందుకు -నా అనుభవమే మీ ముందు వుంచుతున్నాను చూడండి.
ఇంటర్మీడియేట్ వరకు అమ్మాయిలతో మాట్లాడింది అతితక్కువ! ఏదో సందర్భాన్ని బట్టి మాట్లాడడం తప్ప, అంతకు మించి ఏమీ ఉండేది కాదు. ఆడపిల్లల గురించి ప్రత్యేకమైన ఆలోచనలూ ఉండేవి కాదు. కడకు బి.ఎస్.సి మొదటి సంవత్సరంలో కూడా ఆ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. కానీ 1975 లో బి.డి.ఎస్.లో చేరిన తరువాత తప్పని సరిగా ఆడపిల్లలతో కూడా మాటా మంతి, కలిసి తిరగడం, కలిసి చదవడం వంటివి ప్రారంభమైనాయి. స్నేహభావమే తప్ప ఎలాంటి ఇతర ఆలోచనలు ఉండేవి కాదు. ఆడపిల్లలు నా వెంటపడేటంత సీను, నా దగ్గర లేకపోయినప్పటికీ, ఒకరిద్దరి ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించవలసి వచ్చింది. దానికి కారణాలు అనేకం, ఇక్కడ అప్రస్తుతం కూడా!
విజయవాడ పి.డబ్ల్యు.డి. క్వార్టర్స్‌లో, నాకు అక్క – బావ వరస గల బంధువులు ఉండేవారు. అంటే చాలా దగ్గర బంధువులు. వారికీ వున్న ఇద్దరు అమ్మాయిల్లో, పెద్దమ్మాయి మంచి గుణగణాల గురించి మా నాగార్జున సాగర్ అక్క (నేను ఇంటర్మీడియెట్ ఈ అక్క దగ్గర వుండి చదువుకున్నాను) ఎప్పుడూ గొప్పగా చెబుతుండేది. ఆ నేపథ్యంలో నేను అప్పుడప్పుడు విజయవాడ వెళుతుండేవాడిని సెలవుల్లో. ఆ అమ్మాయిని చూసేవాడిని కానీ, ఆమె ఎప్పుడూ ఎదురుపడి మాట్లాడేది కాదు. వాళ్ళది తాతముత్తాతల నుండి క్రైస్తవాన్ని ఆచరిస్తున్నకుటుంబం. వాళ్లకి పూర్తిగా వ్యతిరేకమైన కమ్యూనిస్ట్ భావాలు కలిగిన నాస్తిక కుటుంబం మాది! దేవుడు.. అనే మాట అసలు ఇంట్లో వినిపించేది కాదు. అయితే… ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను కానీ… నా గురించి, నా కుటుంబం గురించీ ఆమెకు తెలియదు కనుక, తెలియజెప్పవలసిన అవసరం ఏర్పడింది. కానీ, ఎలా? ఆ అమ్మాయితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశమే లేదు ఆ ఇంట్లో. బయటకు తీసుకువెళ్లే గట్స్ అసలు లేవు.
అందుకే, ఒక మంచి ఆలోచన వచ్చి, ఉత్తరాలను ఆశ్రయించాను. అలా ప్రారంభమైన ఉత్తరాలు ప్రేమలేఖలుగా రూపాంతరం చెంది సంఖ్య వందకు మించిపోయింది. మనసులు అతి దగ్గరగా చేరిపోయాయి. కానీ అనేక ఆటంకాలు అడ్డుపడ్డాయి. మా ప్రేమ వ్యవహారం, నేను రాసిన ఉత్తరం పెద్ద వాళ్ళ చేతిలో పడడంతో బయటపడింది. వాళ్ళ ఇంట్లో, బంధువుల్లో పెద్ద సమస్య వచ్చిపడింది, చర్చనీయాంశం అయింది కూడా! కారణం వాళ్ళ దృష్టిలో నేను నాస్తికుడిని, అన్యుడిని. అందుచేత ఎట్టి పరిస్థితిలోను, వాళ్ళు నన్ను ఇష్టపడే పరిస్థితి లేదు! మావాళ్లు అమ్మాయిని ఇష్టపడ్డా క్రైస్తవంలో పెళ్లి చేయడానికి ఇష్టపడరు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో, పెద్ద సమస్య వచ్చిపడింది. నేను ఏదోలా మా వాళ్ళను ఒప్పించగలను గానీ, ఆ అమ్మాయికి అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. కూతురిని అమితంగా ప్రేమించే కన్నతండ్రి కూడా మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఆఖరిగా ఆ అమ్మాయి పదునైన అస్త్రాన్ని ప్రయోగించింది. “నేను మామయ్యనే చేసుకుంటాను. లేదంటే అసలు పెళ్లి చేసుకోను” అని భీష్మించుకుని కూర్చుంది.
అమ్మాయి తల్లి (మా అక్క) చాలా తెలివైనది. భవిష్యత్తును జాగ్రత్తగా అంచనా వేయగల వ్యక్తి. నా వల్ల కూతురు సుఖంగా బ్రతుకుతుందనే నమ్మకం ఆమె ఊహించింది. “ఎవరికి ఇష్టం లేకపోయినా, కూతురు ఇష్టపడ్డ అబ్బాయితోనే ఆమె పెళ్లి చేస్తా”నని, నిశ్చయంగా తేల్చి పారేసింది. మా అక్క క్రైస్తవ పెళ్ళికి ఇష్టపడక పోవడంతో, మా అన్న వదినలు కల్పించుకుని, విజయవాడలో ‘సువార్త వాణి’ భవనంలో ఘనంగా పెళ్లి జరిపించేసారు. కొసమెరుపు ఏమిటంటే పెళ్ళైన తర్వాత నన్ను అమితంగా ఇష్టపడ్డవాళ్లు/ఇష్టపడుతున్నవాళ్ళు, అప్పుడు నన్ను వద్దన్నవాళ్ళే!
నా అత్త మామలు
మా మామగారు చాలా ఇష్టపడేవారు. తర్వాత అన్నీ తీపి జ్ఞాపకాలే. మాకిద్దరు పిల్లలు. అబ్బాయి రాహుల్ కానేటి, అమెరికాలో క్వాలిటీ ఇంజనీర్. అమ్మాయి నీహార కానేటి, ఆకాశవాణిలో ప్రోగ్రాం ఆఫీసర్. మాకు ఒక మనవరాలు బేబీ ఆన్షి.
నేను తొమ్మిదేళ్ల క్రితం (2011) సివిల్ సర్జన్‌గా, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో పదవీ విరమణ చేశాను. నా శ్రీమతి అరుణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్)లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. అరుణ నేను ఒకరి కొకరం విషయాలు అవగాహన చేసుకొని సర్దుబాటు మార్గంలో ఆనందంగా గడుపుతున్నాం. దేనికైనా పట్టువిడుపులు ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులుండాలి, ముందుగా ప్రేమకు అర్థం తెలిసుండాలి. ఈ లక్షణాలున్న ప్రేమలు అపూర్వ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సమాజానికి ఒక మాదిరిగా నిలుస్తాయి.
నా పెళ్లి సుఖాంతం చేసిన అన్నా వదినలు – కె.కె.మీనన్, కె.శిరోరత్నమ్మ.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
మీ జ్ఞాపకాల పందిరిలో… యుక్తవయస్సులో కలిగేది ఆకర్షణనా..ప్రేమనా తేల్చుకోలేని స్థితిలో… తల్లితండ్రులు ఆకర్షణ అని నిర్దారించడం…పిల్లలు ప్రేమ అని భావించడం/భ్రమపడడం…వారి మధ్య ఘర్షణ/సంఘర్షణ… పర్యవసానం…..చాలా బాగా వివరించారు… 👉కాని ఒక వాస్తవం ఏమిటంటే…సహృదయంతో పెద్దమనసుతో కులాంతర వివాహాలను తల్లితండ్రులు అంగీకరించినా..ఆ జంట చక్కగా కలిసి మెలిసి ఉన్నా,వారి కుటుంబాల మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు సుహృద్భావ వాతావరణం ఉండే పరిస్థితి సమాజంలో ఇంకా రాలేదని నా వ్యక్తిగత అభిప్రాయం… 👉కొసమెరుపు రాముడు మంచి బాలుడు లాంటి మీరు కూడా ఆ రోజుల్లోనే నిజమైన ప్రేమలో పడ్డారన్నమాట…….
_____ఎం.వి.రంగారావు హనంకొండ.
రంగారావు గారూ మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు
మీ ప్రేమ పందిరిలో ఉత్తరాల జ్ఞాపకాలు అందంగా అలరిస్తున్నాయి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి నిజమైన ప్రేమకు – అసలైన చిరునామా మీకు తెలుసని తెలుపుతున్నాయి
మీ భాషలో, భావనలో నిక్షిప్తమైన నిరాడంబరత ఆప్యాయంగా ఆకట్టుకుంటుంది ఆనందాన్ని పెంచుతుంది
అభినందనలతో ఎలూజయ్
Thank you brother For your valuable Words.
100%love doctor
Uma Thank you For your Good words.
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకొలేదని ఆగవు కొన్నీ అని ఒక సినీ కవి అన్నట్టు గా కాకుండా సంకల్ప బలం అంత గట్టిదై మీరనుకొన్నట్టు మీజీవిత భాగస్వామినినిపొందగలిగినారు ..అడొలొసెన్స్ గురించి చాలా చక్కగా చెప్పినారు . అభినందనలు —రామశాస్త్రి హనంకొండ
శాస్త్రి గారూ మీ స్పందన కు కృతజ్నతలు
Even in present days some parents are not accepting the intercaste/interreligion marriages and they are trying to break the love/or marriage by any means. During colleges days loving is common but continuing the love and proceeding upto marriage and living together happily for so many years is great. You are lucky to get your desires fulfilled. May God bless you both with a happy long and healthy life.
____ch.s.n.murthy Hyderabad
Murthy garu, Thank you For your Good words
ప్రేమ ఎంత మధురం .అదిఫలిస్తే జీవితమే నందనవనం
డా.వీరాచారి గారూ మీ స్పందనకు ధన్యవాదాలు
మీ ప్రేమ కథ ఆసక్తికరంగా, inspiring గా ఉంది సార్
ధన్యవాదాలు శ్రీనివాస్
జ్ఞాపకాల పందిరి మీ ప్రేమ కథ ఆసక్తి కరంగా ఉంది. దేనికైనా పట్టు విడుపులు ఉండాలి మరియు టీనేజ్ పిల్లల ఆగడాలు, లోకంలో జరిగే తీరు బాగా విశదీక రించారు.
జ్ఞాపకాలపందిరి 11చదివాను. మీ అనుభవంలోని ధైర్యం ,స్థిరనిర్ణయం సామరస్యంతో కూడిన నిర్ణయాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలి. రెండుచోట్ల నాకుతోచినసవరణలు నూటికి నూరుశాతం అన్నదగ్గర రెండువాక్యాలుగా విడగొట్టిరాయాలి. అడకత్తెరలో పోకచెక్కలా నలిగి పోయి అంటే బాగుంటుంది ధన్యవాదాలు
__డా.వి.రంగా చా ర్య సాహిత్య కారులు హనంకొండ
సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
Oho sir varidi Prema vivahama Cinema story lagaundi sir so great 😀 Meeru ilage happy ga undalani korukuntunna💐🌺🌹
_____కె.శ్రీహరి ఆకాశవాణి వరంగల్.
శ్రీ హరి గారు మీ స్పందన కు ధన్యవాదాలు
Gyaapakaala pandhiri 11 Mamayyane chesukuntaa….
Prema lekhalu nijam ga punah punah premanu udghaatinchatam. Iruvuri lo prema balapadataaniki ivi dohadam chesaayi. Nijaaniki prema loki praveshame untundhi kaani andhulo nundi nishkramana avasaram undadhu. Evaraina prema ani deninaithe chepthu, venukadugu vesi velli andhulonundi velli pothe adhi aakarshana sthaayi lo ne anthamaina vyavahaaram maatrame. Prema ku erpadda aatankaalu anni ammaayi talli ayina rachayitha sodari nirnayam tho chellacheduru ayipoyaayi. Ammaayi thalli aamodinchina prema bandham saadhaaranam ga sukhaanthamavuthundhi. Ikkada adhe jarigindhi. Katha aasaktikaram ga saagindhi. Prema vishayam gharshana unnantha varaku aasaktikaram ga untundhi. Okka saari anni vyathirekatalu dooramai premikulu okkatayyaaro, ika katha biguvu tagguthundhi. Alaa chusinappudu, katha chivari rendu paragraphs katha prabhaavaanni tagginchettuga unnaayi. Aa rentini vadilesthe ee prema katha prabhaavopetham ga miguluthundi ani naa bhaavana. Meeru aalochinchandi.
____గంటా రామి రెడ్డి హనంకొండ.
Sir Thank you somuch For your detailed response. And some suggestions.
[24/06, 19:39] Mohan vedangi. pedababu: హాయ్ బాబాయి [24/06, 19:41] Mohan vedangi. pedababu: నిజంగా ఎప్పటివో విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడం చాలా గొప్ప విషయం
____v.Mohan. Singapore.
మోహన్ నీ స్పందన కు ధన్యవాదాలు
Superrrrrrrrr…….Love Story Really you are Great Man of Love A to Z. You Tasted the Love n Enjoyed the Love with Lover, as a life partner. Enjoying Love with Children n Grand Children. Now Enjoying Love with Gnapakala Pandiri ‘ Prema Mandiram ‘ Hats….. Off…..
your Lovely Life .
_____డా.ఓ.నాగేశ్వర రావు హైదారాబాద్.
బ్రదర్ నీ..స్పందనకు ధన్య వాదాలు.
Delayed comment because of my laziness regarding your family life you are blessed with good children you have given them good education good behaviour and great understanding power and love very good episode God is great.
____Dr.T. Venkateswarlu Kazipet.
డాక్టర్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలు
డాక్టర్ గారు.. మీ జ్ఞాపకాల పందిరి లో ఉత్తరాల ప్రేమాయణ పర్వం అద్భుతం.. ఉత్తరాల ద్వారా ప్రేమని పెంపొందించి మీరు, చేసుకుంటే మామయ్యనే చేసుకుంటా అని మొండి పట్టుదలతో ఆమె జంటగామారి కుటుంబానికి విలువనిస్తూ ప్రేమని కాపాడుకొని దంపతులయ్యారు.. మీరు టీనేజ్ పిల్లల మనసులో ఆశలు, లోకం తీరు బాగా విశదీకరించారు..
నీలిమ గారూ మీ స్పందన కు కృతజ్నతలు
కొన్నిసార్లు పరిస్థితులు తారుమారై కనుల ముందు చేరి మన నిగ్రహాన్ని సవాలు చేస్తుంది.అప్పుడే కాస్త సంయమనం పాటించి మనసును అదుపు చేసుకొంటే సమస్య తోక ముడిచి పోతుందని పెద్దలు చెప్పిన మాట నిజమని మరోసారి నిరూపించబడింది సర్
____ఉదయ శ్రీ ప్రభాకర్ హనంకొండ
అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలు
Dr. K. L.V. Prasad garu… నమస్కారం. జ్ఞాపకాల తోరణాలను చక్కగా వివరించారు. ముఖ్యంగా కదన విధానం చాలా బావుంది…. Of course.. మీలాంటి చెయ్యి తిరిగిన రచయితకు అది అవలీలమైన పని. మొదటి సగంలో ఎదుగుతున్న పిల్లల మనః స్తితి , అందులోనూ ఆడపిల్లల పరిస్ఠితి చక్కగా విశ్లేషించారు. మీ ప్రేమ, అది సాఫల్యమయిన విధానం బాగా వివరించారు…. ప్రేమ/కులాంతర వివాహాలు, తదనంతర జీవితం సఫలం కావాలంటే… విశాల దృక్పథం, వాస్తవ పరిస్థితిని అర్దం చేసుగోగల జ్ఞానం, ఒకింత హేతు భావజాలం ఉండాలి. దురదృష్టవశత్తూ అధికశాతం ప్రేమ/కులాంతర వివాహాలు, భావావేశం/ఆకర్షణ లతొ జరుగుతాయి. కాలక్రమేణా ఆవేశం/ఆకర్షణ తగ్గగానే సమస్యలు మొదలవుతాయి. విచక్షణ, ఓర్పు, నేర్పు గలవారు సమస్యలను అధిగమిస్తారు. లేకుంటే……. ఏది ఏమయిప్పటికీ… మీ ప్రేమకథ విజయం సాధించినందుకు అభినందనలు.. ఆ ప్రేమ ఇప్పటి వరకు తరగనందుకు అభినందిస్తూ, భవిష్యత్తు లోనూ తరగదని ఆశిస్తున్నాను….
దాస్ గారూ మీ ప్రేమ పూర్వక స్పందన కు ధన్యవాదాలు
Doctor gariki namaskaramulu. Doctor garu miru antha manchi premikulu anipinchukunnaaru. Appati, meelanti prema ku ardham manchi viluvalu vunnayi.mee prema kadhanu inka purthiga cheppaledani anukuntunnaanu.oka rachayita thana sviya prema kadha nu cheptu vunte vinadaaniki vinpuganu sonpuganu vundi. Evaraina bharya bhartha lu ardam chesukuni okari pai okaru nammakam tho vunte ade prema lo vunde Mamata, madhuryam. Prema nu prema tho peemisthunte ah bhagavantudu kuda addu radani na vudhesham.. idhi na Jeevitha sathyam..
Mrs.pushpa Dr. Laxmirajam. Hyderabad
మేడం, మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు
[26/06, 08:58] Pramod Kusuma@ HYDERABAD: Baga prarambincharu sir [26/06, 09:00] Pramod Kusuma@ HYDERABAD: Photos bagunnayi Sir [26/06, 10:15] Pramod Kusuma@ HYDERABAD: Beshajalu lekunda nikkachiga nirmohamatam lekunda rasaru Jeevitham sukantham ela chesukovalo indirect ga message icharu sir Chala bagundi sir
___ప్రమోద్ కుసుమ . హైదారాబాద్.
ప్రమోద్ మీ స్పందనకు కృతజ్నతలు.
మీ జ్ఞాపకాల పందిరి లోకి వెళ్లాను మీ ప్రేమ లేఖలు సాఫీగా సాగాయి ఆ లేఖలోని మధురమైన విషయాలను కొన్ని రాస్తే బాగుండేది మీ అత్తయ్య దూరదృష్టి వల్ల ఆమె మంచి తెలివిగలది కాబట్టి మీ వివాహం జరిగింది నేను అందులో కామెంట్ పెట్టాను కానీ అందులో నుండి పంపించే విధానం నాకు తెలియడం లేదు అందువల్ల వాట్సాప్ లో నా అభిప్రాయం పోస్ట్ చేస్తున్నాను
_____మహమ్మద్ అబ్దుల్ రషీద్ . . .తెలుగు పండిట్ హైదారాబాద్.
మాస్టారూ మీ స్పందనకు ధన్య వాదాలు.
మొత్తం మీద కథ సుఖాంతం అయ్యింది.. అభినందనలు తమ్ముడూ ,బాగా రాశావు!👌👌👌👌👌👌
______పెబ్బిలి హైమవ తి రచయిత్రి విశాఖ పట్నం
అక్కగారూ మీ స్పందనకు ధన్యవాదాలు.
మంచి అమ్మాయి అని తెలిసి ప్రేమించేందుకు ఆసక్తి చూపారు. స్థిర నిర్ణయం తో పరిస్థితులను అనుకూలం చేసుకుని , పెళ్ళి చేసుకున్నారు. విజవంతమైన వైవాహిక జీవితాన్ని స్వంతం చేసుకున్నారు. మీ జ్ఞాపకాల పందిరి యువత కు ఆదర్శం.
___పువ్వాడ శారద హైదారాబాద్.
శారద గారూ మీ స్పందన కు ధన్యవాదాలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 36
అమ్మ కడుపు చల్లగా-46
‘సాఫల్యం’ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన
వారాల ఆనంద్ చిన్న కవితలు 6
‘శతాబ్ది సూరీడు’ నవల – పోటీ ఫలితాలు – ప్రకటన
జ్ఞాపకాల పందిరి-137
బాలుడు – దేవుడు
పదసంచిక-103
కయ్యూరు హైకూలు-4
శ్రీపర్వతం-54
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®