[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘ఒంటరితనం నాతోనే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ నడుమ ఒంటరితనం నాతోనే వుంటోంది నేను దాని ఒళ్లో కూర్చుంటున్నాను పలకరించేవాళ్లు లేకా కాదు కలిసి కరచాలనం చేసే వాళ్ళు రాకా కాదు ఒంటరితనం తీగెలాగా నన్నల్లుకునే వుంటోంది అప్పుడప్పుడూ ఒంటరితనాన్ని ఇంట్లో వదిలేసి రోడ్డుమీదికి నడుస్తాను మార్కెట్‌కి వెళ్తాను థియేటర్ లోకి చూస్తాను కొనడానికో చూడ్డానికో సంతోషించడానికో నాకు అక్కడేమీ కనిపించలేదు అసహజమయిన వెర్రిమనిషిలా నిలబడిపోయాను అప్పటిదాకా గమనించనే లేదు ఒంటరితనం నాకు తెలీకుండానే నా అనుమతి లేకుండానే నీడలా నా వెంటే నడిచింది అమ్మయ్య ఒంటరితనం తోడుగా ఇంట్లోకొచ్చి ఓ పుస్తకం ముందేసుకున్నా ఆ రచయిత నాతో సంభాషించండం మొదలుపెట్టాడు ఒంటరితనం నా పక్కనే కూర్చుని ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అతి ప్రేమ ప్రమాదకరం
తల్లివి నీవే తండ్రివి నీవే!-22
గాల్లో తేలినట్టుంది..!!
జ్ఞాపకాల పందిరి-27
ఏరిన ముత్యాలు 11
మళ్లీ మొలకెత్తిన మందారం
తిమిరనాశని
కైంకర్యము-18
ఇయర్హుక్-వ్యాఖ్య-రైటర్స్ వర్క్‌షాప్ 5 – ప్రకటన
పదసంచిక-114
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®