సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ, రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం పేరు వినగనే మనసు ఎంత సంబరంగా ఉందో! ఎన్నెన్ని మరపురాని మెలడీ సాంగ్స్! శోభన గారి గురించి, చిత్ర గారి గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడం సంతోషంగా ఉంది.
    కానీ చివరలో – లోకంలో అన్నీ మారుతున్నట్టు సంగీత ప్రపంచంలో కూడ ఇన్ని అవాంఛనీయమైన మార్పులా!
    మనుషులు, వాయిద్యకారులు, లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ మ్యాజిక్ లేకుండా “అంతా కీ బోర్డు” మయమైపోయిందా! ఈ వేగం, ఈ మార్పు ఏ ప్రస్థానానికో!
    ఇక AI ప్రవేశిస్తే.. మనుషుల ప్రమేయమే ఉండదేమో! మానవ సంబంధాలు లేకుండా యంత్ర మయమై, కృత్రిమమైన వాతావరణంలో బతికేస్తామా! “జీవం” ఉండదా!
    మీరు చెప్పేవరకూ చిత్రసీమలో సంగీతంలోనూ ఈ మార్పులు చోటు చేసుకున్నాయని ఊహించలేకపోయాం.
    పోనీండి. మంచిని గ్రహిద్దాం. మంచివే జ్ఞప్తిలో ఉంచుకుందాం!*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శైల కుమార్ గారి స్పందన:*అద్భుతంగా రాస్తున్నారు. గొప్ప ప్రయాణం మీది. ఎన్నో నేర్చుకోవచ్చు ఈ తరం 🙏 *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాసుందరి గారి స్పందన:*ఎస్.వి. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గార్ల సినిమాలు బాగుంటాయని అనుకోవడమే గానీ, వారికి సినిమా పట్ల అంత అనురక్తి ఉందనే విషయం ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. ఒక పని చేయాలంటే మనస్ఫూర్తిగా ఇష్టం, అంతరంగం నుంచీ పెల్లుభికిన తృష్ణ ఉంటే తప్ప సాధ్యం కాదు. సినిమా పాటల పట్ల మీకున్న అనురక్తి చిన్నప్పుడే చింతలపూడి పోస్టర్ల మీద ఆత్రేయ గారి పేరు పక్కన మీ పేరు రాసుకున్నప్పుడే వ్యక్తం కాలేదా? మీలాంటి ప్రతిభావంతులు, కళాకారుల సమాహారమే మంచి సినిమా అవుతుంది. అన్నట్టు రాజ్ కపూర్ సినిమా చూసి బందిపోట్లు సరెండర్ అవడం చూడండి.. ఎంత బావుందో. సినిమాని కొత్త పుంతలు తొక్కించినవాడు రాజ్ కపూర్. మనసులో బలంగా ఒకటి అనుకుంటే అది ప్రేక్షకుల జీవితాల్లోనూ ఊహించనంతగా మార్పు తీసుకొచ్చిన మహనీయుడు.
    అలాగే చిత్ర గారి గురించి మీరు చెప్పిన ముచ్చట్లు. ఆమెని మీరు వెన్నెల అన్నారు. పెర్ఫెక్షన్ కుదిరేవరకు వదిలిపెట్టరన్నారు. ఆ లక్షణం వల్లనే ఆమె ఇప్పటికీ పాటలు పాడుతున్నారు. ఇళయరాజా గారు, మనో అయితే ఆణిముత్యాలే. ఎందరు మహానుభావుల గురించో మీరు పరిచయం చేస్తున్నారు. వారి వ్యక్తిత్వం, ప్రతిభా సంపత్తి గురించి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు అన్నా.
    చండి (రమాసుందిరి)*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉంగుటూరు శ్రీలక్ష్మి గారి స్పందన: *పాటలు సంగీతంతో పాటు కళాకారుల కష్టసుఖాలు కూడా చెప్పారు. మీరు వ్రాసింది చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంగళ కందూర్ గారి స్పందన: *మీరు వ్రాసిన 15.వ.భాగం లో చాలా విశేషాలు వున్నాయి. ఔను. కృష్ణారెడ్డి మాట్లాడే సరస్వతి ఐతే, అచ్చిరెడ్డి గారు మౌన సరస్వతి. వీరిద్దరూ కలసి కుటుంబం అంతా కలసి చూసే సినిమాలు తీశారు. నేటి కాలానికి కావలసిన పిచ్చి సినిమాలు వీరు తీయలేరు. రాజన్-నాగేంద్ర కన్నడంలో చాలా చక్కని పాటలు ఇచ్చారు. కొన్నింటిని మన తెలుగు సినిమాలలో వాడుకున్నారు. ఇ వి వి.సత్యనారాయణ గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఒక ట్రెండును సృష్టించారు. హాస్యానికి ప్రథమ స్థానం ఇచ్చారు.
    You are correct. Friends of hour కాదు friends of all time.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ నరసయ్య గారి స్పందన: *మీరు పాట, మాట తియ్యగా రాస్తారు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. చాలా చాలా తెలియనివి ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో మంచిని చూసే మీ మంచితనంతో పాటు మీలో పట్టుదలతో కష్టపడే తత్వం మిమ్మల్ని కూడా అందరూ ఇష్టపడతారు. ఒకసారి పరిచయమయితే ఎవరూ మరవలేరు. చాలా మంది గురించి చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అండి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®