2016 లో తీసిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో వుంది. అంతర్జాతీయ అవార్డులు పొందిన ఈ చిత్రం ఇక్కడ థియేటర్లలో విడుదల అయ్యిందా, అయితే ఆడిందా నాకు తెలీదు. కానీ ఈ చిత్రం చూసిన తర్వాత ఒక ఆనందకర ఆశ్చర్యాన్ని అనుభవించాను.తెలుపు నలుపు రంగుల్లో మొదలయ్యే ఈ చిత్రం చాలా నెమ్మదిగా రంగులను పులుముకుంటుంది. ఇది వరకు మన ఎరుక ప్రకారం ప్రతీదీ తెలుపు నలుపుల్లోనే వుండదు, కొన్ని ఊదా రంగుల్లో కూడా ఉంటాయి. ఈ చిత్రం ఆ మూడు రంగులే ఎందుకు? కోట్ల రంగుల్లో వుంటుందీ ప్రపంచం అంటుంది.హరి అజీజ్ (ధ్రువ పద్మాకర్) అనే పదకొండు ఏళ్ళ కుర్రాడు తన తల్లి పార్వతి (వాసుకి), తండ్రి గౌరవ్ శర్మ (ఇమ్రాన్ అజీజ్) లతో ఆస్ట్రేలియా నుంచి భారత దేశానికి వస్తాడు. తన వయసుకంటే ఎక్కువ పరిణతి కలిగిన వాడు. బుర్ర నిండా సవా లక్ష ప్రశ్నలు. లోకంలో ప్రతి దానికీ ఒక రంగుతో కలిపి చూడడానికి అలవాటు పడ్డ ఈ లోకంలో ప్రేమ రంగు ఎరుపు అంటాడు. అలాగే ద్వేషమూ, హింసానూ. ఆ వెంటనే వచ్చే దృశ్యం సమున్నత హిమాలయాల కంటే ఎత్తుగా ఎగురుతున్న మన జాతీయ జెండా. బడిలో టీచర్ అడుగుతుంది మన జాతీయ జెండా రంగులు దేన్ని సూచిస్తాయో తెలుసా అని. తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని చెబుతాడు కాషాయం పరిత్యాగానికీ, తెలుపు స్వచ్చతకీ, ఆకుపచ్చ పుడమికీ, నీలవర్ణపు చక్రం ధర్మానికి సంకేతాలంటాడు. బయటకెళ్ళాక ఓ పిల్లవాడంటాడు నువ్వంత పెద్ద పెద్ద సమాధానాలు చెబుతావేంటి? నీకు టీచర్ కంటే ఎక్కువ తెలుసా? కాషాయం హిందువులకీ, ఆకు పచ్చ ముస్లింలకీ, తెలుపు క్రిస్టియన్లకీ గుర్తులు అంటాడు. ఇద్దరూ పిల్లలే. ఇద్దరి చూపులు ఎంత భిన్నం. కారణం ఎవరు?గౌరవ్, పార్వతిలు కలిసి ఒక చిత్రం తీస్తుంటారు. ఆమె పని వ్రాయడం, అతను దర్శకుడు. అతనికి ఎంతటి సకారాత్మక దృష్టికోణం అంటే అతనికి భారత దేశం అంటే వర్ణ మయం, ప్రేమ మయం అయిన లోకంలా కనిపిస్తుంది, దానికి విరుధ్ధమైనవి కనిపిస్తూ వున్నా. వాళ్ళు తీసే చిత్రం కూడా అలాంటి సకారాత్మక చిత్రమే. పెట్టుబడి పెడతామన్న ఇద్దరిలో ఒకడు తప్పుకుంటాడు. ఇల్లు అమ్మి అయినా చిత్రం తీయాలి. ఇలా ఒకటి తర్వాత మరొకటి ఆటంకాలు వస్తూనే వుంటాయి. కారణం మరేమీ లేదు అతను ఒక ముస్లిం, ఆమె ఒక హిందువు. ఎవరికీ నచ్చని విషయం ఆ స్నేహం. అటు ముస్లింలకీ ఇటు హిందువులకీ కూడా. హరి అజీజ్కి బడిలో సీట్ కూడా ఇదే కారణంతో లభించదు.
హరి అజీజ్ తన తండ్రికి మానసికంగా చాలా దగ్గర. ఈ కథ కూడా అతని దృష్టికోణం నుంచే చెప్పబడింది. వేరే దేశం నుంచి వచ్చిన అబ్బాయి ఇక్కడి పరిస్థితులను తండ్రి కంటే నిజాయితీగా అర్థం చేసుకోగలుగుతాడు. తండ్రిదేమో స్వాప్నిక ప్రపంచం. హిందూ ముస్లింల మధ్య గొడవలు, సమలైంగికుల పట్ల దేశమూ, దేశం లోని ప్రజలూ అన్యాయ పూరితంగా ప్రవర్తించడం. ఇవన్నీ వాస్తవిక దృష్టితో చూసే హరి అజీజ్ తన తండ్రికి రాను రాను పెరుగుతున్న కష్టాలు, వచ్చే బెదిరింపులు అతన్ని తండ్రి గురించి బెంగ పెట్టుకునేలా చేస్తాయి. పెద్దలు పిల్లలని జాగ్రత్త అని చెప్పినట్టు వాడు తండ్రికి జాగ్రత్తలు చెబుతాడు. రెండో పెట్టుబడిదారుడు కూడా చేతులెత్తేస్తే, కనీసం మన దగ్గర వున్న వనరులతో ట్రైలర్ లాంటిది తీసి, అది చూపించి జనాలను మెప్పించి, ఒప్పించి పెట్టుబడి సంపాదించవచ్చు అని నిర్ణయిస్తారు.ఇలా ఎన్నెన్ని ఇబ్బందులు ఎదురుకొని, ఎదురీది, కష్టనష్టాలు తట్టుకుని ఆ ముగ్గురూ, వాళ్ళి మిత్ర బృందమూ ఎలా ముందుకెళ్తారు, చివరికి ఏమవుతుందన్నది మిగతా కథ.మన ఇప్పటి కాలానికి అవసరమైన చిత్రమే ఇది. ఎన్ పద్మాకుమార్ రచనా బాగుంది, దర్శకత్వమూ బాగుంది. అలాగే అతని చాయాగ్రహణమూ బాగుంది. అతని తొలి ప్రయత్నమంటే నమ్మ బుధ్ధి కాదు. అందరి నటనా బాగుంది. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హరి అజీజ్ గా చేసిన ధ్రువ్ పద్మాకుమార్ నటన. ముద్దుగా కనబడుతూ, ఎంతో తెలివిగా మాట్లాడే ఇతను దర్శకుడి కొడుకే. సేన్ వాయిస్ అంటామే దానికి అతను ప్రతీక.చాలా గొప్ప సినిమాలు తండ్రీ కొడుకుల కథలుగా వచ్చాయి, అప్పుడెప్పుడో వచ్చిన ఇటాలియన్ చిత్రం బైసికిల్ తీవ్స్ నుంచీ. రెండు తరాలకు సంబంధించిన కష్టాలను ఆ తరాల ప్రతినిధులుగా తండ్రీ కొడుకులు ఎలా నడుము బిగించి సముద్రాన్ని ఈదారు అన్నది గొప్పగా చూపించారు ప్రతి చిత్రం లోనూ.ఈ పాటికే చూసి వుండక పోతే తప్పకుండా చూడండి. నెట్ఫ్లిక్స్ లో వుంది.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
మంచి సమీక్ష
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఉట్టి మాటలు కట్టిపెట్టి – గట్టి చేతలు చేపట్టాలి
లక్ష్య సాధనలో..
శంకర విజయం
జీవన రమణీయం-72
విభిన్నమయిన రచనలు చేయాలనుకునేవారికి ఆహ్వానం
చచ్చినా వేయి
రవంత
నీ చిరునవ్వుతో బతికేస్తాలే
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-25
‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-4
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®