“దేవుడు అందరిలాను వుండాడు, అంతా వుండాడు అనేది అందరు తెలుసుకొనాలా, తెలసి నడసుకొనాలా” అని గుడిలాని జనాలకి బుద్ధి చెప్పి ఇంటి దొవ పట్టిరి సాములోళ్లు
ఆయప్ప శిష్యుడు కూడా దోవసాగి సాములోళ్ల ఎనక
నడస్తావుండాడు. ఇట్ల పోతాపోతా వున్నెబుడు ఓణి
చేనుకి కల్లబోస్తా వున్న కూలోడు అనుకోకుండా తన చెయ్యి నరుకొనె రక్తం కారతావుంది. ఆ రక్తం చూస్తా నొప్పికి తడుసుకోలేక
కండ్ల తిరికి కిందికి పడె.
అది చూస్తానే సాములోళ్ల శిష్యుడు వానితాకి పోయి రక్తం
ఉజ్జి, చేతికి కట్టుకట్టి నీళ్లు తాగిపిచ్చి కూలోనికి రవంత సేవచేసే
“ఇంగ సాలురా, పొదాము” అనిరి సాములు
“రవంత సేపు సామి, ఈ అప్ప కండ్లు తీస్తానే పోదాము” అనే శిష్యుడు
“నాకే ఎదరు చెప్పతావా?” కొపముగా అనిరి సాములు.
“అట్లంటారేమి సామి, నేను మీ మాటకి ఎబుడన్నా ఎదరు చెప్పిండానా? ఈ మనిషి ఇట్ల వుంటే ఎట్ల పొయేది?”
“అట్లయితే ఆ మనిషికే సేవ చేస్తా కూకో” ఇంగా కోపముగా
అనిరి సాములోళ్లు
“దేవుడు అంతా వుండాడు, అందరిలనూ వుండాడు అనే
మీ మాటల్ని నేను నమ్ముతాను సామి, దాన్నింకా ఈ మనిషి కండ్లు తీసి నడిచేగంటా ఇతనికి సేవ చేస్తా వుంటా సామి” ఇంగా కోపముగా అనె శిష్యుడు.
***
రవంత – కొంత.
Manchi Katha sir
నాలుగు వాక్యాల్లో నాలుగు వేదాల.సారం చెప్పారు 👌👌💐💐
Nice story Best regards Ranjith Kumar, Japan.
Thanks
దండాలండి
Nice story
Very good story
Nice story sir
Awesome story… keep going gurugaru
Super sir
Very nice story sir
Super o super
Ravantha anedhi naki neeki ee jagattiki kaane kavalisinadhi anedhanni katha roopamlo chappina kathanayakunaki abinadanamulu. Ramakrishnappa. V. Chikkathirupathi,Malur ta, Kolar do, Karnataka.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™