నిర్జన నిశ్శబ్ద నీరవ నిశీధిలో నీ తలపుల కొలిమిలో కాగుతున్నాను! నీ కోసం పరితపిస్తున్నాను, పలవరిస్తున్నాను! మనం గడిపిన మధుర క్షణాలు నన్ను వెంటాడుతున్నాయి ఈ నిరామయ గాడాంధకారంలో అందుకే నీకై ఈ ఆవాహన! ఒహ్! ఒక్కసారి వచ్చిపో కనికరంతో నిద్రలేమి దాని పాత్రను సక్రమంగా పోషిస్తుంది సజల నయనాలు చెక్కిళ్ళను నిమురుతున్నాయి ఇప్పుడు మన మధ్య అనుసంధాన కర్తలెవ్వరూ లేరు ఈ సంభాషణ ఇరు ఆత్మల తంతిలోనే! నా యెద నిండా నువ్వే నిండాక ఇక నాకోసం యోచించే తావెక్కడిది? నీవు నీ స్మృతులే నాకిప్పుడు పంచప్రాణాలు నీ ఊసులూ, బాసలే అన్నపానాలు నా మనోవేదనను ఉపశమింపజేసి శాంతినీ, క్రాంతినీ కలిగించేది – నీ రాకే! నా దుఃఖాన్ని దిగమ్రింగేది – నీ వెచ్చని స్పర్శే!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మెట్రో జీవన చలనచిత్రాలు ‘అపగామిత మరి కొందరు’ కథలు
సంచిక – పద ప్రతిభ – 7
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-2
దొంగ ఎవరు?
లోకల్ క్లాసిక్స్ – 19: బోడో గుడ్లగూబ పాట!
ఆకాశవాణి పరిమళాలు-13
మహాకవి గురజాడ – మతం-2
మహాప్రవాహం!-20
సీత-16
చిరుజల్లు-85
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®