సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    avmrao

    తెలుగు పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాలన్న ప్రయత్నం బాగుంది. ఛందోబద్ధ పద్య కవిత్వం భారతీయ భాషల్లో తెలుగు భాష ప్రత్యేకత. సంస్కృత ఛందస్సు మూలం నించే తెలుగు ఛందస్సు ఉద్భవించినా అనేక వృత్తాలు, మాత్రా ఛందస్సు, అంత్య, అనుప్రాసలు, యతి నియమాలతో తెలుగు పద్య నిర్మాణం చాలా జఠిలంగా ఉంటుంది. అటువంటి నియమాల మధ్య ఎంతో హృద్యమైన తెలుగు పద్యం అనేక కవుల కలం నుంచి అలవోకగా అన్ని పద్య నియమాలనూ పాటిస్తూ సాహితీ సంపద సుసంపన్నంగా నిలిచి ఉంది. అటువంటి తెలుగు పద్యాలలోని సాహితీ సౌరభాన్ని ఇంగ్లీషులోకి అనువదించే ప్రయత్నం కత్తి మీద సామే! ఆంగ్ల కవిత్వం సాధారణంగా అనుసరించే ఓ మీటర్‌కి అనేక కవుల గ్రంథాలనుంచి ఎన్నుకున్న కొన్ని తెలుగు పద్యాల అనువాదం బాగానే ఉన్నది అనిపించింది. అయితే మనకే స్వంతమైన తెలుగు కవి భావనలు అనువాదం అవుతున్నా తెలుగు పద్యంలో ఉండే బిగి, సొబగు ఆంగ్లంలోకి రూపాంతరం చెందించడం కష్టసాధ్యం! తప్పితే, భావానువాదం చేయడంలోనూ ఇంగ్లీష్ కవిత్వపు నడకను రప్పించడంలోనూ శ్రీ భట్టు వెంకటరావు గారు సఫలీకృతం అయ్యారనే చెప్పాలి.
    మంచి ప్రయత్నం.

    మరిన్ని అనువాద పద్యాలు వీరినించీ, ప్రేరణగా ఇతరులనుంచీ ‘సంచిక’లో ఆశిద్దాం.

    Reply
  2. 2

    dvnmsarma

    ఇంత మంచి ప్రయత్నాన్ని తలకెత్తుకున్న శ్రీ వెంకటరావు గారి భగీరథ ప్రయత్నం సంపూర్ణ సఫలీకృతం కావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటూ ఇందుకు తగిన వేదికను అమర్చి ప్రోత్సాహం అందిస్తున్న “సంచిక” యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను.
    విశ్వవ్యాప్తంగా విస్తరించిన వివిధ భాషా సాహిత్య సంస్కృతులు వేటికవే ప్రత్యేకతలు కలిగి వేలాది సంవత్సరాల కాలం మనుగడ సాగిస్తున్నాయి అంటే అందుకు మూల కారణం వాటికి సహజంగా ఉండే ఇచ్చి పుచ్చుకునే లక్షణం. ముఖ్యంగా ఆయా మంచి చెడ్డలు దేశాంతరాలు వ్యాపించాలంటే సాహిత్యం ముందుగా పరిచితం కావాలి. మన మాతృభాష తెలుగు, పుచ్చుకోవడంలో చూపిన శ్రద్ధ, ఆసక్తులు ఇవ్వడంలో చేయలేదు. ఎప్పటికైనా అది జరిగిన నాడే విశ్వ వేదిక పై మన స్థానం సుస్థిరం అవుతుంది. అందుకు ప్రయత్న పూర్వకంగా ఆ ఆవశ్యకతను పసిగట్టిన సమర్ధులు, ఇదిగో ఇలా వెంకటరావు గారు చేపట్టినట్టు అనువాద యజ్ఞాలకు శ్రీకారం చుట్టాలి. తెలుగు వారంతా అందుకు యధోచితంగా సహకరించాలి. ఆ శుభదినాలు అపారమైన తెలుగు సాహిత్య సంపదకు అతి చేరువలో ఉన్నాయని ఇలాంటి వ్యాసాలు తారస పడినప్పుడు అనిపించడం సహజం!
    ఎన్నో ఇలాంటి వ్యాసాలను తెలుగు పత్రికల్లో క్రమం తప్పకుండా అందించే వెంకటరావు గారు, ఈ అనువాద ప్రయత్నం తాలూకు ప్రత్యేకతను, ప్రాముఖ్యతను దృష్టి లో ఉంచుకుని బహుశా ఈ “సంచిక” వేదికను ఎన్నుకుని ఉంటారు. వారి నుండి మరెన్నో ఇలాంటి వ్యాసాలు సంచిక ద్వారా మనకు, విశాల ప్రపంచానికి అందుతాయని ఆశిస్తూ… శలవు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®