సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * లక్ష్మీప్రియ పాకనాటి గారి ఈ శీర్షిక ద్వారా మరుగున పడిన అద్భుత నటులను మొక్కసారి గుర్తు తెచ్చుకునే అవకాశం కలిగింది.
    కేష్టో ముఖర్జీ గారు మహమూద్, ఓం ప్రకాష్, అస్రాని మొదలైన ప్రసిద్ధ హాస్యనటులకు ఏ మాత్రం తీసిపోని కామెడీ మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరు.
    “పరిచయ్”, “షోలే”, “జంజీర్”, ” బాంబే టు గోవా”, ” గోల్ మాల్” మొదలైన సినిమాల్లో వారి నటన ఒక ఎత్తు అయితే, “లోఫర్” సినిమాలో ఓం ప్రకాష్ తో కలసి పండించిన సీన్ ఈరోజుకి కడుపుబ్బ నవ్విస్తుంది
    “ఖూబ్ సూరత్” సినిమాకు గాను 1981 లో ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకోవడం ముదావహం.
    రాజ్ కిరణ్ నా అభిమాన నటుడు. షుమారు 100 చిత్రాలు వరకు నటించి, హిందీ చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న చక్కని నటుడు.
    “కర్జ్” లోని సింగర్ పాత్ర అద్భుతంగా పోషించాడు. ఇక “అర్థ్”, “బసేరా”, “ఫర్జ ఔర్ కానూన్”(కొండవీటి సింహం రీమేక్ లో మోహన్ బాబు పాత్ర), జస్టిస్ చౌదరి(తెలుగు జస్టిస్ చౌదరి హిందీ రీమేక్ లో రాజా పాత్ర) “రాజ్ తిలక్”, “ఘర్ ఏక్ మందిర్” మొదలైన సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ వ్యక్తిగత, మానసిక సమస్యల మూలాన అకస్మాత్తుగా అదృశ్యం అవడం బాధాకరం.
    మంచి నటులను గుర్తు చేసిన లక్ష్మీ గారికి ధన్యవాదాలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®