అమ్మలందరిదీ ఒకటే కడుపుతీపి, అదే రక్ష..రక్ష
బిడ్డలుగా మనమంతా సుఖంగా బతికేద్దాం
ఆమె తిండి కోరదు, పిల్లలు తినడం తల్లి సంతోషం
మన కల్మషాన్నికక్కిపోసినా నవ్వేసి
మౌనంగా కడిగి డెట్టాల్తో శుభ్రపరుస్తుంది
ఫోన్లో ఎప్పుడైనా తియ్యని నాలుగు మాటలు
రెండు చీరలూ, డజన్ యాపిల్స్..ఆమెకింకేం కావాలి?
నోరుజారి మాట తూలినా, వాదించక వదిలేస్తుంది
తప్పులేకున్నా, లాపాయింట్లు తెలిసినా తలొంచుకునే
అమ్మ, మనిషికి అప్పనంగా దేవుడిచ్చిన వరం
మన స్వార్ధపు చేతల్నీ,అహంకారపు కూతల్నీ
చూసీ చూడనట్టొదిలేస్తుంది,రికార్డ్ చెయ్యదు
చదువుకున్నా నిరక్షరపక్షిలా, కల్లాకపటం లేని అమ్మ
మనందరికీ ఎప్పుడూ ఇష్ట దేవతే! ఎన్నో కవితలు రాశాం
‘ప్యారీ మా’ ప్రేమ చిత్రాలు గీసి ప్రైజ్లూ పొందాం
బిడ్డల కట్రాడుకు కట్టిన గోవులా, ఆర్తి చూపుల్తో
అక్కడే తిరుగుతూ,అమ్మ మనల్ని ఒదిలిపోదు
మదర్స్ డే కేక్ మిత్రులతో పంచుకుంటే, ప్లేట్లు కడిగే
ఆమె కళ్ళ ప్రేమవాహినిలో తడవడం అదృష్టం
దేవుడిచ్చిన దాసి అమ్మే! వాడుకుంటే తప్పేంలేదు
భాగస్వామితో లా అగ్రిమెంట్ల బాధ అమ్మతో లేదు
ఫ్యామిలీతో సహా నెత్తిన పడినా నొచ్చుకోదు
ఎన్ని నెప్పులున్నా నోరు విప్పి చెప్పదు
మనవల్తో ఉండాలన్నఆవిడ కోరిక తీరుద్దాం
సెలవుల్లో విశ్రాంతి విహారయాత్ర మనం చేద్దాం
తన లోక జ్ఞానమంతా మరిచిపోయి,అమ్మ
కట్టుబానిసలా మన చుట్టూనే ఉండాలి
మనం చేసే మోసవేషాలన్నీమూగమొద్దులా
గంగిగోవులా భరిస్తుంటే గొప్ప సుఖం కదూ
మనకెప్పటికీ అమాయకపు అమ్మే కావాలి
దయతో ఆమె కడుపున పుట్టినందుకు
పెద్ద చదువుల బిజీ ఉద్యోగస్తులైనందుకు
ఆమె మనకెప్పటికీ రుణపడి ఉండాలి
మనకి మర్యాద తెలుసు,తీరినప్పుడు చెబుదాం
అమ్మకి జేజేలు! అమ్మకి వందనాలు!!

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
11 Comments
పుట్టి. నాగలక్ష్మి
దేవుడిచ్చిన దాసి, అప్పనంగా దొరికిన బహుమతి, చదువుకున్న నిరక్షరపక్షి , కట్రాడుకు కట్టినగోవు, కట్టు బానిస, మూగమొద్దు, గంగిగోవు… అమ్మకి ఇన్ని…నిష్టూర నిజ ఉపమానాలా?
సమకాలీన పరిస్థితులను… నిక్షిప్తం చేసుకున్న కవిత… అభినందనలు, కవయిత్రి కి, సంచిక వారికి


Jhansi Lakshmi
ప్రతి అక్షరం నిజం
G. S. Lakshmi
అద్భుతం. నిజమే. అలాంటి అమాయకపు అమ్మలే కావాలి పిల్లలందరికీ. చక్కటి కవిత. అభినందనలు.
కొల్లూరి సోమ శంకర్
Anu…Hyderabad
కొల్లూరి సోమ శంకర్
కాస్త కఠినంగా వున్నా యదార్ధం.పిల్లలకు,పెద్దలకు యోచన చేసుకునే ఓ అవకాశం.simply superb.







Mallik..Krishna
కొల్లూరి సోమ శంకర్
బావుంది


బాధగాకూడావుంది
LALITHA…HYD
కొల్లూరి సోమ శంకర్
బంగారు చెల్లీ… మీరు అక్షరాలు మమతల మల్లెలు.. మనసునలరించే మధురిమలు..












సూపర్బ్ అమ్మలు….
Kaasimbi..Guntur
gdkyyprml@gmail.com
తల్లి మనసు ఎంత చక్కగా వివరించారు గౌరీలక్మిగారు. తరాలు మారినా తల్లి మనసు అంతే కదా. మీ కవిత కు నా నమస్సుమాంజలి.
Trinadha Raju Rudraraju
వ్యంగ్యంగా ఉన్నప్పటికీ వాస్తవం చెప్పారు. అమ్మ
కొల్లూరి సోమ శంకర్
అక్షర సత్యం. ఇదంతా ఈనాటి యాభై ఏళ్లు నిండిన లేదా అరవైకి దగ్గర పడిన తల్లులు చాలామంది అనుభవించేదే.
అమ్మ ఎప్పుడూ పిల్లల దగ్గర అమాయకపు అమ్మే.ఆమె ఎంత తెలివైనది అయినా అలాగే ఉంటుంది.అది ఆమెకు ఇష్టం. అలా ఉండి ఎప్పుడూ పిల్లల్ని గెలిపిస్తుంది
Jayaveni..Gudiwada
ఉషారాణి పొలుకొండ
Chala baga chepparu madam… Excellent




