మా ఇంటి దైవం..
మా కంటి వెలుగు..
మా ప్రతి పనిలోనూ తోడు..
మా ప్రతి అడుగుకు మార్గనిర్దేశనం..
మా ఆలోచనలకు దిక్సూచి..
మా వెన్ను తట్టి ప్రోత్సహించే స్ఫూర్తి ..
మా చిన్ని హృదయానికి
అనురాగాల సందళ్ళ సిరుల గమకాలను
అందించే ఆత్మీయ మానవతామూర్తి..
మా జీవితాలకు జయకేతనాల హర్షాల
వంటి వెలుగు బాటలను
పరిచయం చేసే ప్రతిభావంతురాలు..
మా ఎదుగుదలే తన ఆశయంగా శ్రమించే ఉత్తమురాలు..
మహోన్నత వ్యక్తిత్వాన్ని కలిగిన సహృదయురాలు..
మా అమ్మ.. ‘శ్రీమతి శాంతకుమారి’
అమ్మ పాదాలకు ఆత్మీయ
వందన సమర్పణం.. ఈ కవితా కుసుమం!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.