ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నుంచి విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అందుకున్నారు. తెలుగు తల్లి జ్ఞాపికను, నగదు పురస్కారాన్ని ఈ సందర్భంగా అందజేశారు. 50 ఏళ్ల తన సాహిత్య పరిశ్రమకు తగిన ఫలితం ప్రతిఫలం దక్కిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, తేజస్వి పొడపాటి గారు కూడా పాలుపంచుకున్నారు.


మార్చి 30న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారాన్ని(సాహిత్యరంగం) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నుంచి స్వీకరిస్తున్న కవి, రచయిత చలపాక ప్రకాష్.

