సంచికలో తాజాగా

అరుణ సందడి Articles 1

సందడి అరుణ కుమారి (కలం పేరు: 'రాగ') తెలుగు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలి. కర్నూలులో జన్మించి, ప్రస్తుతం నెల్లూరులో నివసిస్తున్న ఈమె M.A., B.Ed. చదివారు. సాహిత్య రంగంలో వచన కవిత్వం, కథలు, నవలలు, గజల్స్ వంటి వివిధ ప్రక్రియల్లో రాణిస్తూ.. 'అరుణాక్షరాలు', 'నా హృదయ తరంగాలు', 'చిగురించిన చిరునవ్వు', 'ఆత్మీయ బంధాలు', 'వెంటాడిన పగ' వంటి పుస్తకాలను ప్రచురించారు. నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షురాలిగా, తెలుగు సాహితీవనం అడ్మిన్‌గా సేవలు అందిస్తున్నారు. సాహిత్యంతో పాటు చిత్రలేఖనం (ఆర్ట్ ఎగ్జిబిషన్స్), వీణ, కూచిపూడి నాట్యాలలో ప్రవేశం ఉన్న ఈమెను 'సకలకళావల్లభి సారస్వత మంజీరా', 'కవన నక్షత్రం' బిరుదులు, రాజా రవివర్మ అవార్డు, గిడుగు రామ్మూర్తి పురస్కారం సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. సామాజికంగా రెడ్ క్రాస్ సంస్థ (మాగుంట సుబ్బరామరెడ్డి స్పాస్టిక్ సెంటర్) ద్వారా సుదీర్ఘకాలం ప్రత్యేక శిక్షణ బోధకురాలిగా సేవలు అందించారు. ఈమె భర్త ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా. డి. ప్రేమ్ చంద్.

All rights reserved - Sanchika®