సంచికలో తాజాగా

రాజశేఖర్ కలికి Articles 1

నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరి పైరు గాలి నా తొలి శ్వాస. చిన్నప్పటి నుంచి దొరికిన ప్రతి పుస్తకం చదవడంతో పాటు, కవితలు, కథలు, పద్యాలు, వ్యాసాలు, ఏవి తోచితే అవి రాయడం అలవాటు. వరంగల్లులో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనూ ఈ సృజన కొనసాగింది. కవితలూ, వ్యాసాలూ, హాస్యరచనలూ పత్రికల్లో వెలుగు చూశాయి. కొన్ని నాటకాలు రాసి, వాటికి వేదికపై ప్రాణం పోశాను కూడా. తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టాక, ‘కోడ్’ లైన్లు పెరిగాయి, కవిత పంక్తులు తగ్గాయి. కలం ఎక్కడో మూల నిద్రపోయింది. ముప్పై సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ మేల్కొంది. నా కథలు, కవితలు ముఖ్యంగా సమకాలీన సమాజం, నగర జీవన విధానాలు, ఐటీ ఉద్యోగాలు, మానసిక సమస్యలు, మరియు కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగుతాయి.

All rights reserved - Sanchika®