సంచికలో తాజాగా

మాచిరాజు కామేశ్వర రావు Articles 1

మాచిరాజు కామేశ్వర రావు గారు 21/05/1955 తేదీనాడు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో జన్మించారు. కీ.శే. సీతారామయ్య, రత్నకుమారి దంపతులు వీరి తల్లిదండ్రులు. కామేశ్వరరావు గారు కెనరా బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి రిటైరై ప్రస్తుతం సైనిక్‌పురి, సికింద్రాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. భార్య.. లక్ష్మి కుమారి, అమ్మాయి స్రవంతి, అబ్బాయి కార్తిక్. కామేశ్వర రావు గారి మొదటి కథ 'గుడ్డువాడి డబ్బు' సెప్టెంబర్, 1969 చందమామలో ప్రచురితం. 56 సంవత్సరాలుగా బాల సాహిత్యంలో కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 500 లకు పైగా పిల్లల కథలు అన్ని పత్రికల లోనూ ప్రచురితమయ్యాయి. అందులో కేవలం చందమామ లోనే 250 కి పైగా కథలు వచ్చాయి. వీరి 'పాపిష్టి డబ్బు' కథల సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి బాల సాహిత్య పురస్కారం, 'దేశసేవ' పుస్తకానికి 'కొనిరెడ్డి ఫౌండేషన్' వారి బాల సాహిత్య పురస్కారం, 'సూర్య చంద్రులు' పుస్తకానికి నాగభైరవ సాహితీ సమితి ఉత్తమ కథల సంపుటి పురస్కారం వచ్చాయి. అనేక ఇతర పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం 'మాచిరాజు బాల సాహిత్య పీఠం' స్థాపించి ప్రతి సంవత్సరం తమ తల్లిదండ్రుల పేరు మీద ఇద్దరు బాల సాహితీవేత్తలను సత్కరించడం, బడి పిల్లలకు కథల పోటీ నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటు, కథల పుస్తకాలు, జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ఇవ్వడం చేస్తున్నారు.

All rights reserved - Sanchika®