సంచికలో తాజాగా

కె. రామ్ మోహన్ రావు Articles 8

రచనా వ్యాసంగం 2015 నుంచి ప్రారంభం అయింది. మొదటి కథ ‘చిరునామా చేరని ఉత్తరం’ స్వాతి మాసపత్రిక లో ప్రచురించబడింది. అదే ఏడాది ఒక కథకు మూడో బహుమతిగా రంజనీ అవార్డ్, 2016 లో ‘డాక్టర్ సాబ్’ కథకు స్వాతి వారపత్రిక పోటీలో 10 వేల రూపాయల బహుమతి, తర్వాత సుకథ కథల పోటీలో మొదటి బహుమతి 15000 రూపాయలు, ఆ తర్వాత రమ్యభారతి కథల పోటీలో ప్రథమ బహుమతి.. ఇలా అనేక బహుమతులు లభించడమే కాక స్వాతి, ఈనాడు ఆదివారం అనుబంధం లో అనేక కథలు ప్రచురించబడ్డాయి. ఇప్పటివరకు 110 కి పైగా కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

2024లో నా కథ ‘Women’s Era’ అనే ప్రముఖ ఇంగ్లీష్ మేగజైన్ లో పబ్లిష్ అయినది.

నా నవల ‘ఎదురు లేని ఏడు’ కు ఆన్వీక్షికి సంస్థ ద్వారా 10 వేల రూపాయల బహుమతి లభించింది.

నా కథలు రెండు కన్నడంలో కి అనువాదం అయ్యాయి. వీటితో పాటు ఈనాడు లో ప్రచురితమైన ఏడు కథలు, బహుమతుల కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయి.

నా విద్యార్హతలు - MSc, M.Phil.. Anakapalle AMAL. కాలేజీలో కెమిస్ట్రీ HOD గా 2011లో రిటైర్ అయినా స్థానిక డా. హిమశేఖర్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫేకల్టీ గా పనిచేస్తూ, ఇప్పటివరకు కెమిస్ట్రీ పరిజ్ఞానం తో 251 కేన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించాను. ఆ అవగాహన విస్తృత పరచడానికి కర్కాటకం నవల రాసాను.

3 ఏళ్ల క్రితం అనకాపల్లి తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 135 కార్యక్రమాలు చేసాను.

All rights reserved - Sanchika®

error: Content is protected !!