సంచికలో తాజాగా

వరిగొండ కాంతారావు Articles 25

శ్రీ వరిగొండ కాంతారావు భారతీయ జీవిత బీమా సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత అయిన కాంతారావు గారు - 'ఉద్యానం', 'ఝరి', 'సంద్రం', 'గగనం', 'అనలానిలం', 'ప్రణవం' - అనే కవితా సంపుటులు; 'దోస్తానా', 'కృష్ణార్పణం' అనే కథా సంపుటులు వెలువరించారు. 'దోస్తానా' కథా సంపుటిని డా. యం. రంగయ్య గారు హిందీలోకి అనువదించారు. 'సాహచర్యం', 'వ్యామోహం' అనే నవలను రచించారు. 'ఏలికకొక లేఖ', 'వినగనేర్తున భాజపా!', 'భరతసుతుడా మేలుకో!', 'స్వీయ ప్రకటనమ్', 'తల్లి భారతి!', 'వారు ఓటును నాకు వేసెను!', 'ముదమునందగ మోది వచ్చెను', 'దేహమన్నది భ్రాంతియేనా!' - అనే గేయ శతకములు రచించారు. 'బాసర జ్ఞానమనంత ప్రవాహము', 'శుభకృత్తంతయు మేలే జరుగును' అను మకుట సహిత గేయాళి రచించారు. 'శోభకృన్మాతృవత్సరం శుభములిచ్చు' అనే పద్య శతకం వ్రాశారు. ఇవి కాక, 'పంచాగాన్ని నమ్మడమెలా? ఒక ఆలోచన', 'ఇట్ల సుత - కురుక్షేత్ర రహిత మహాభారత గాథ', 'బమ్మెర పోతన చరిత్రలో కొన్ని విశేషాలు', 'శ్రీ అరవిందులు' వంటి రచనలు చేశారు. 'వరిగొండ కాంతారావు సాహిత్య విశ్లేషణ' అన్న అంశంపై పరిశోధన చేసి శ్రీమతి తాండ్ర సునీత కాకతీయ విశ్వవిద్యాలం నుంచి పిహెచ్.డి. పట్టాను పొందారు. అభినవ కాళోజీ, కాకతీయ కవితాజు, ఖగోళ సరస్వతి వంటి బిరుదులు గల కాంతారావు గారు 2019 శ్రీ కాట్రగడ్డ సాహిత్య అవార్డు గ్రహీత.

All rights reserved - Sanchika®

error: Content is protected !!