సంచికలో తాజాగా

డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం Articles 2

పాఠకలోకానికి చిరపరిచుతురాలైన డా. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారి అసలు పేరు కె. మీరాబాయి. శ్రీ వెంకటేశ్వరావిశ్వవిద్యాలయం, తిరుపతి నుండి ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు పొందారు. ఆంగ్ల అధ్యాపకురాలిగా కె.వి.ఆర్. ప్రభుత్వ కళాశాల, కర్నూల్, ఆంధ్రప్రదేశ్ నుండి పదవీవిరమణ చేశారు. 1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు అన్ని ప్రముఖ ప్రింట్, అంతర్జాల పత్రికలలో పత్రికలలో ప్రచురితం. పలు కవితలు వేర్వేరు పత్రికలలో ప్రచురితమయ్యాయి. 1.) మనిషి-మమత 2.) చెదిరినస్వప్నం 3.) సంహిత, 4.)సిద్ధసంకల్పం అనే నవలలు ప్రచురితమయ్యాయి. 1.ఆశలమెట్లు 2. కలవరమాయె మదిలో 3. వెన్నెలదీపాలు 4.మంగమ్మగారి అమెరికా కథలు 5. మనసు పరిమళం 6.ఏ దేశమేగినా 7.జగమంతకుటుంబం - అనే కథా సంపుటాలు వెలువరించారు. 1. కర్నూలు కథ 2. గుర్నూలు పూలు 3. చలువపందిరి 4. రాయలసీమ హాస్యకథలు 5. మాకథలు పన్నెండు సంకలనాలలో, 6. అయిదు కలాలు- అయిదుగురు రచయితలు, 7. ఉగ్ర తుంగభద్ర 8. కథాకేళి 9. క్షీరసాగరంలో కొత్తకెరటాలు 10.రాయలసీమ రచయితల కథలు 11. మా ఉగాది కథలు మొదలైన ఎన్నో సంకలనాలలో వీరి కథలు చేర్చబడ్డాయి. అమెరికా తెలుగు కథానిక 2020లో, డయాస్పోరా కథలు 2021 లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. తెలుగు కథ శతజయంతి కథా సంకలనం 'నూరు కథలు- నూరుగురు కథకులు' లో వీరి కథ చోటు చేసుకుంది. మీరా సుబ్రహ్మణ్యం గారి కవితలు, ఆంగ్ల కథలు, వ్యాసాలు ప్రసిద్ధ ఆంగ్ల పత్రికలలోనూ, సాహితీ సంకలనాలలోనూ స్థానం దక్కించుకున్నాయి. వీరి పలు ప్రసంగాలు, కథలు, నాటికలు ఆకాశవాణి కడప, కర్నూలు కేంద్రాల నుండి ప్రసారితమయ్యాయి. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. సాహిత్యరంగంలో పలు బహుమతులు గెల్చుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపకురాలి పురస్కారం అందుకున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!