సంచికలో తాజాగా

డాక్టర్ మామిడాల శైలజ Articles 9

డాక్టర్ మామిడాల శైలజ ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రి. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. సమకాలీన తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శైలజగారు సమాజంలోని రుగ్మతలు, మహిళల సమస్యలు, సామాజిక న్యాయం, మానవ సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని అనేక రచనలు చేశారు. ఆమె కలం నుండి దాదాపు 300 కవితలు, 4 నవలలు మరియు 50కి పైగా కథలు జాలువారాయి. సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గాను 'ఉమెన్ లెజెండరీ అవార్డు', 'సంక్రాంతి సాహితీ రత్న అవార్డు' వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. ఇటీవలి కాలంలో ఆమె ప్రచురించిన కవితా సంపుటి 'మెరికలు' (2024), నవల 'ది ఎకోస్ ఆఫ్ ఎ సైలెంట్ హార్ట్' (2025), పాఠకులలో ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తిత్వ వికాస పుస్తకం 'నౌ విక్టరీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్' (2026) పాఠకులను అలరించాయి.

All rights reserved - Sanchika®