సంచికలో తాజాగా

అక్షర Articles 11

పుట్టిపెరిగి గ్రాడ్యుయేషన్ చేసింది జంషెడ్పూర్‌లో. ఎం.ఎ. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి చేసారు. వీరి నాన్నగారు కీర్తిశేషులు శ్రీ భాగవతుల ఉమామహేశ్వర శర్మగారు స్వయంగా తెలుగు సాహిత్యం, భాష అంటే ప్రాణంగా చూసుకునేవారు. ఆఖరిశ్వాస వరకూ తెలుగు కావ్య రచనలు చేసి, తెలుగుతల్లి సేవ చేసారు. ఆయన ప్రభావం వలన కొంతా, అప్పటికే తెలుగు రచయిత్రిగా మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న శ్రీమతి సుగుణమణి (అరవింద) గారి ప్రోత్సాహం, సాంగత్యం వలన వీరిలో కథలు రాయాలన్న ఉత్సాహం పొంగిపొర్లింది. ఫలితంగా ప్రయత్నపూర్వకంగా తెలుగు రాయటం, చదవటం నేర్చుకుని, స్థానిక పత్రిక కోసం రాసారు. అవి అందరూ మెచ్చుకున్నందున ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలకు పంపటం, వారు వాటిని ప్రచురించటం జరిగింది. కథా రచయిత్రి పేరు తెచ్చుకుంటూన్న సమయంలోనే వివాహం జరిగి సంసార సాగరంలో మునిగితేలుతూ, స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తూ, జీవితాన్ని ఈ రెండింటికి అంకితం చేసారు. సంసార బాధ్యతలు కొంతవరకు తీరాక వీరి లోని రచయిత్రి నేను ఇంకా బ్రతికి ఉన్నానంటూ ముందుకొచ్చింది. ఈసారి తమ బంధువు అయిన అనూరాధ ప్రోత్సాహంతో మళ్లీ రాయటం మొదలుపెట్టారు. తాను సాహితీ ప్రపంచంలోకి అడుగుపెడితే పైలోకంలో ఉన్న తమ నాన్నగారు చూసి తప్పకుండా సంతోషిస్తారన్న ఆశతో ఉన్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!