సంచికలో తాజాగా

సుగుణ అల్లాణి Articles 12

శ్రీమతి అల్లాణి సుగుణ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. అత్తవారిల్లు కూడా హైదరాబాదే! పదవ తరగతి పూర్తవుతూనే పదహారేళ్లకు పెళ్లైతే, ఆ తర్వాత MA B.Ed వరకు చేయగలిగారు. వారి శ్రీవారు మడుపు శ్రీకృష్ణారావు గారు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆర్కిటెక్ట్. చదువు మీద అత్యంత ఆసక్తి, ప్రీతి కలిగిన రచయిత్రి అత్తగారు శ్రీమతి లక్ష్మీబాయి గారు సుగుణగారిని కాలేజీకి పంపి చదివించారు. ఆ ప్రోత్సాహమే ఈనాడు తాను రచయిత్రి/కవయిత్రిగా పరిచయం చేసుకొనే అవకాశం కలిగిందని చెప్పడానికి గర్విస్తారు. ముప్పై సంవత్సరాలు వివిధ పాఠశాలలలో తెలుగు అధ్యాపకురాలిగా చేసి ప్రస్తుతం మనుమలతో ఆడుకుంటున్న అదృష్టవంతురాలినని అంటారు సుగుణ. ఈ విశ్రాంత జీవనంలో అప్పుడప్పుడు అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ iPad లో కథలు చదువుతూ చిన్న చిన్న కవితలు కథలూ రాస్తూ TV లో సినిమాలు చూస్తూ స్నేహితులను కలుస్తూ కావలిసినంత సంతోషాన్ని పంచుతూ ఆనందపడుతూ కాలం గడుపుతూ ఉంటారు.

All rights reserved - Sanchika™

error: Content is protected !!