సంచికలో తాజాగా

తిరుమల శ్రీ Articles 4

‘తిరుమలశ్రీ’ అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. ఆలిండియా సర్వీసెస్ కి చెందిన వీరు, భారతప్రభుత్వపు జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు. ‘తిరుమలశ్రీ’, ‘విశ్వమోహిని’ కలం పేర్లు. తెలుగులో - అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. 190 నవలలు పుస్తకరూపంలోను, పత్రికలలోను, సీరియల్స్ గానూ ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలకు బహుమతులు లభించాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ఎడిటింగులో అనుభవం. పలు సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ‘కలహంస’’ పురస్కార గ్రహీత. ‘కథాకిరీటి’, ‘కథా విశారద’, ‘బాలకథాబంధు’ బిరుదాంకితులు. ఆంగ్లంలో - కథలు, వ్యాసాలు వందకు పైగా ప్రముఖ జాతీయ దినపత్రికలలోను, ‘కేరవన్’, ‘విమెన్స్ ఎరా’, ‘ఎలైవ్’, ‘ఆడమ్ అండ్ ఈవ్’, ‘సాజిత్’, ‘చందమామ’ (ఆంగ్లం), ‘గోకుల్’, మున్నగు ప్రముఖ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. ఓ ప్రముఖ జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం రాసారు. 20 ‘ఇ-బుక్స్’ ప్రచురింపబడ్డాయి. స్టోరీమిర్రర్ (మల్టీ-లింగ్యువల్ పోర్టల్) యొక్క ‘లిటరరీ కల్నల్’ మరియు ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు…‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2019’ నామినీ. ‘ఆథర్ ఆఫ్ ద మంత్’ (సెప్టెంబర్ 2020) టైటిల్ (& బహుమతి) గ్రహీతలు. ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ (1st రన్నరప్)(రీడర్స్ ఛాయిస్), మరియు, 2nd రన్నరప్ (ఎడిటర్స్ ఛాయిస్) టైటిల్స్ అండ్ ట్రోఫీస్ గ్రహీతలు. హిందీ లో - అరడజను కథలు ప్రచురితం కాగా, బాలల నాటిక ఒకటి ఆలిండియా రేడియోలో ప్రసారమయింది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!