సంచికలో తాజాగా

వాడపల్లి పూర్ణ కామేశ్వరి Articles 5

నోరి సుందరేశ్వర రావు, లలిత దంపతుల కుమార్తె, పూర్ణ కామేశ్వరి జన్మ స్థలం పిఠాపురం. దక్షిణ రైల్వేలో ప్రైవేట్ సెక్రెటరీగా పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వీరి ప్రస్తుత నివాసం చెన్నై.

2003 నుండి దక్షిణ రైల్వే కార్యాలయం చెన్నైలో నిర్వహించే హిందీ భాషా వ్యాస రచనల పోటీలు, పుస్తక సమీక్ష పోటీలలో పాల్గొని అనేక పురస్కారాలు పొందడం జరిగింది.  ఆంగ్లంలో కూడా చిన్నా పెద్దా వ్యాసాలు, కథలు వ్రాయడం ప్రవృత్తైంది.  మాతృభాషలో వ్రాయాలనే ఆసక్తితో, 2020 తరువాత తెలుగులో వ్రాయడం ప్రారంభించి స్వల్పకాలంలోనే వీరి కథలు ప్రచురణకు ఎంపికవ్వడం, బహుమతులు గెలవడంతో సాహితీ ప్రయాణం అలుపెరుగనిదిగా సాగింది.

2021 నుండి అనేక కథలకు బహుమతులు పొందడం, మరెన్నో కథలు ప్రచురణకు ఎంపికవ్వడం జరిగింది.  ఇంత వరకూ నూరుకు పైగా కథలు ప్రచురితమైయ్యాయి.  లేఖిని సరసిజ, తపస్వి, తెలుగు తల్లి-కెనెడా, కథా మంజరి, విశాలాక్షి, సహరి, కథా వేదిక, రవళి, సాహో, ఉషా, సుమతి, నెచ్చెలి, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, పాలపిట్ట, సంచిక, సాహితీ కిరణం, జాగృతి మొదలగు సంస్థలు నిర్వహించిన పోటీలలో అనేక బహుమతులు పొదడం జరిగింది.

ఐదు నవలలు,  మూడు నవలికలు పోటీల్లో ఎంపికై ప్రచురితమైయ్యాయి.  మన తెలుగు కథలు.కామ్ లో వెబ్ సీరీస్ గా ఒక నవల ప్రచురితమవ్వగా,  తపస్వి మనోహరం నిర్వహించిన పోటీల్లో వీరి నవలకు ప్రథమ బహుమతి లభించింది.

అనేక కవితలు, వ్యాసాలు, గజళ్ళూ కూడా వీరి కలం నుండి జాలువారి పత్రికల్లో ప్రచురితమైయ్యాయి.

సామాజిక ధృక్పథం కలిగిన మరెన్నో రచనలు చేస్తూ, సాహితీ పయనాన్ని కొనసాగించాలన్నదే వీరి అభిలాష.

All rights reserved - Sanchika®