సంచికలో తాజాగా

వేణు నక్షత్రం Articles 1

వేణు నక్షత్రం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ పూర్తి చేసి 1998లో జీవన భృతిని వెతుక్కుంటూ అమెరికా చేరారు. సిద్దిపేటలో 90వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్ఫూర్తితో, కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్న వీరి రచనలు (పాటలు, కవితలు, కథలు) అన్నీ ఏదో ఒక విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగానే వుంటాయి. ఇటీవల పదకొండు కథలతో 'మౌనసాక్షి' అనే సంకలనం వేశారు. వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు పాఠకులను ఆకట్టుకుని, ఆలోచింపజేశాయి. గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ రంగంలో పని చేస్తున్నప్పటికీ, ప్రవృత్తిగా సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకొని సాహిత్య, సాంస్కృతిక రంగంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా తన కలానికి ఎప్పుడూ ఏదో పని చెపుతూనే ఉన్నారు. అమెరికాలో పలు సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేసి, ఆ తర్వాత తీసిన మూడు కథల సమాహారం "మూడు హృదయాల చప్పుడు" (ఎంతెంత దూరం, పిలుపు, అవతలివైపు అనే మూడు లఘు చిత్రాలు, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఉంది) ఎంతో మంది ప్రజల హృదయాలకు దగ్గరయ్యింది, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆత్మీయంగా పలకరించింది. సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల ప్రజలకి కొంతనైనా అవగాహన కల్పించడమే వారి రచనల ముఖ్య ధ్యేయం.

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!