సంచికలో తాజాగా

యల్లపు ముకుంద రామారావు Articles 23

శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్‌పూర్‌లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S. కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు - వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు. అదే ఆకాశం - అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ - జీవిత విశేషాలు) - పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు - (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) - మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం - పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) - వీరి స్వీయ అనువాద రచనలు. వీరి రచనలు అనేకం - పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం - ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం - అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) - వీరి కథలు, ఇతర రచనలు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!